»Karnataka Election 2023 Campaign And 5pm May 8th 2023
Karnataka election campaign: 5 గంటలకు ముగింపు..మే 10న ఓటింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Karnataka assembly election campaign) సోమవారం(may 8th) సాయంత్రం 5 గంటలకు పూర్తి కానుంది. మే 10న ఎన్నికల ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని అధికారులు నిలిపివేయనున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నిసీట్లు వస్తే అధికారం చేజిక్కించుకుంటారో ఇప్పుడు చుద్దాం.
కర్ణాటక అసెంబ్లీ 2023 ఎన్నికల ప్రచారం(Karnataka election campaign) కాసేపట్లో ముగియనుంది. సోమవారం(may 8th) సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. గత కొన్ని రోజులుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు BJP, కాంగ్రెస్, JD(S) నుంచి ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంలో భాగంగా మెగా ర్యాలీలు, రోడ్ షోలు కూడా నిర్వహించి సవాళ్లకు ప్రతి సవాళ్ల విసురుకుంటూ పలువురు నేతలు వ్యాఖ్యలు చేసుకున్నారు.
అయితే కర్ణాటక అసెంబ్లీ(Karnataka assembly)లో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా 113 సీట్లు గెలవాలి. ఇక మొత్తం 224 సీట్లలో 36 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు, 15 షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో మే 10న కర్ణాటక కొత్త ప్రభుత్వం కోసం ఓటింగ్ జరగనుంది. అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడికానుండగా.. మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది.
మరోవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో భారతీయ జనతా పార్టీ (BJP), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (Congress) నుంచి పెద్దలు ఆటుపోట్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు. మరోవైపు 1985 నుంచి కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ పార్టీ సైతం వారి ప్రజాదరణ చూసి గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ ఏకంగా ఆరు రోజుల పాటు దాదాపు 15 బహిరంగ సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. దీంతోపాటు ప్రాంతీయ పార్టీ JD(S) H D కుమారస్వామి సైతం స్థానికంగా గట్టిగానే ప్రచారాన్ని నిర్వహించారు. ఈ పార్టీ నేతలు కూడా వారి ప్రాంతాల్లో గెలుపుపై ఆశాభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.