»Realme C55 Smartphone For Rs 10 Thousand Days From March 28
Realme C55: రూ.10 వేలకే స్మార్ట్ ఫోన్..మార్చి 28 నుంచి సేల్
'మినీ క్యాప్సూల్' Realme C55 మోడల్ త్వరలోనే దేశీయ మార్కెట్లోకి రాబోతుంది. మార్చి 28 నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999గా ప్రకటించారు. ఈ ఫోన్ ఫీచర్లు ఇతర వివరాలపై ఓ లుక్కేయండి మరి.
Realme నుంచి తక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్(smartphone) మార్కెట్లోకి రాబోతుంది. ఈ Realme C55 సరికొత్త డిజైన్‌లో కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఫీచర్లను కలిగి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ధర, ఇతర ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Realme C55 మార్చి 28 నుంచి మధ్యాహ్నం 12:00 గంటలకు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ సన్ షవర్, రైనీ నైట్ అనే రెండు మోడళ్లలో లభిస్తుంది.
ఈ హ్యాండ్సెట్ 6.72-అంగుళాల LCD ప్యానెల్, HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 90Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 180Hz. LCD ప్యానెల్ కారణంగా, ఫింగర్‌ప్రింట్ రీడర్ పవర్ బటన్‌తో అనుసంధానించబడి ఉంది. Realme C55, LPDDR4X RAM, EMMC 5.1 స్టోరేజ్ సౌలభ్యంతో కల్గి ఉంది. ఇది MediaTek Helio G88 SoCపై కొనసాగనుంది. ఈ ఫోన్లో 1TB వరకు స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. Realme C55 బరువు 189.5 గ్రాములు కాగా ఫోన్ మ్యాట్-ఫినిష్డ్ పాలికార్బోనేట్ ఫ్రేమ్, మాట్-ఫినిష్డ్ రియర్ ప్యానెల్, డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది.
మరోవైపు డ్యూయల్ రియర్ కెమెరాలతో అమర్చబడిన Realme C55 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, డెప్త్ సెన్సింగ్ కోసం ఉపయోగించే 2-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ ప్రియులు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఉపయోగించుకోవచ్చు. కనెక్టివిటీ కోసం Realme C55 Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, ఛార్జింగ్, డేటా బదిలీ కోసం USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే Realme C55 భారతీయ వెర్షన్ కూడా 5G కనెక్టివిటీ సపోర్ట్ లేదు. కానీ 4G/LTE నెట్‌వర్క్‌ల కోసం రెండు నానో సిమ్ స్లాట్లను కలిగి ఉంది. ఫోన్ 5,000mAh బ్యాటరీతో 33W SuperVOOC వైర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. Realme C55 మోడల్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, అయితే 6GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. మరోవైపు 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వచ్చే టాప్ ఎండ్ మోడల్ ధర రూ.13,999గా ప్రకటించారు.