»Rajasthan Man Swallows 56 Blades Doctor Operates Metals In Bizarre Incident
Breaking News : యువకుడి కడుపులో 56 బ్లేడ్లు…ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు..!
Breaking News : ఓ యువకుడి కడుపులో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 56బ్లేడ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ యువకుడి కడుపులో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 56బ్లేడ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జాలోర్ జిల్లాలోని సంచోర్ ప్రాంతానికి చెందిన యశ్పాల్ సింగ్ అనే యువకుడు ఇటీవల తీవ్ర కడుపు నొప్పి, రక్తపు వాంతులతో ఆస్పత్రిలో చేరాడు. బాధితుడ్ని ముందుగా దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అతడి పరిస్థితి మరింత విషమించిన కారణంగా.. పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో నగరంలోని మెడ్‌ప్లస్ ఆసుపత్రికి యువకుడిని తరలించారు. అతనికి పలు పరీక్షలు చేసిన వైద్యులు ఎక్స్ రే చూసి షాకయ్యారు. అతని కడుపులో దాదాపు 56 బ్లేడ్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం ఆపరేషన్ చేసి.. విజయవంతంగా వాటిని బయటకు తీశారు. దీంతో యువకుడి ప్రాణాలను కాపాడారు.
యువకుడిని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు అతడి ఆక్సిజన్ లెవల్స్ 80 వద్ద ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా కష్టమని చెప్పిన వైద్యులు.. విజయవంతంగా చికిత్స పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.