»Rain Forecast For Ap Ap From March 16 To March 20th 2023
AP:లో మార్చి 16 నుంచి 20 వరకు వర్షాలు కురిసే అవకాశం!
ఏపీ(ap)లో మార్చి 16 నుంచి 20 వరకు వర్షాలు కురిసే అవకాశం(rain forecast) ఉందని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ రాష్ట్రాలపై ప్రభావం పడనుందని తెలిపింది. ఈ క్రమంలో పంట కోత దశలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్(andhra pradesh) రాష్ట్రంలో ప్రస్తుతం ఎండాకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. ఈ క్రమంలో మార్చి 16 నుంచి 20 వరకు వానలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ గాలుల వల్ల ఏర్పడిన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉంది. ఎత్తైన ప్రదేశం నుంచి 7.6 కి.మీ, ఇది బీహార్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు చత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 16న తూర్పు ఇండియా మీదుగా మరో ద్రోణి, దక్షిణ రాష్ట్రాలపై ఇంకో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వెల్లడించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు(wind flow) వస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ గాలులు దిశను మార్చి దక్షిణం నుంచి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. అయితే దీని ప్రభావం నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలిపాయి. ఈ ప్రభావంతో మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏపీలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rain forecast) కురుస్తాయని ఐఎండీ(imd) శనివారం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఏపీలో కురియనున్న వర్షాల వల్ల పంటలకు నష్టం(crop loss) జరిగే అవకాశం ఉందని అధికారులు ప్రజలను(people) హెచ్చరించారు. కోత దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు అధికారులు సైతం ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఒక వేళ వర్షం తుపానుగా మారితే పంట నష్టం మరింత పెరిగే ఛాన్స్ ఉందని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు(officers) తెలిపారు.
మరోవైపు క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పారు. దీంతో ఇవి ఏర్పడిన ప్రదేశాల్లో అధిక గాలులు వీస్తాయని వాతావరణ(weather) అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వేడిగాలుల నుంచి ప్రజలకు(people) కొంత ఊరట లభించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల 2 నుంచి 4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అయితే రానున్న మరో నాలుగు రోజులు కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.