Rahul Gandhi : ప్రధాని మోదీ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లో పర్యటిస్తున్న ఆయన... అధికార పార్టీ పై మండిపడ్డారు. పార్లమెంట్ లో తాను మాట్లాడిన ప్రసంగంలో కొంత భాగాన్ని తొలగించారని ఆయన ఆరోపించారు.
ప్రధాని మోదీ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లో పర్యటిస్తున్న ఆయన… అధికార పార్టీ పై మండిపడ్డారు. పార్లమెంట్ లో తాను మాట్లాడిన ప్రసంగంలో కొంత భాగాన్ని తొలగించారని ఆయన ఆరోపించారు. లోక్ సభలో తాను ఇచ్చిన ప్రసంగంలో ఎవరిని కూడా కించపరచలేదని, అయినా తన ప్రసంగం నుంచి కొంత భాగాన్ని తొలగించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఇదే విషయమై లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశానని, అయితే అందుకు సాక్ష్యాలు ఇవ్వాలని తనను కోరినట్లు రాహుల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తన ప్రసంగంలో నుంచి ఏఏ భాగాలను తొలగించారో సాక్ష్యాలతో సహా లోక్ సభ స్పీకర్ కు లేఖ ద్వారా పంపానని రాహుల్ పేర్కొన్నారు.
తన ప్రసంగంలోని ప్రతి ఒక్క పదం పార్లమెంట్ రికార్డ్ లో ఉండాలనేది తన అభిమతం కాదన్నారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ తనను అవమానించేలా మాట్లాడారని అన్నారు. నీ పేరు గాంధీ ఎలా అవుతుంది నెహ్రూ ఎందుకు కాదు? అంటూ మోదీ తనను అవమానించేలా మాట్లాడారని అయినా మోదీ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించలేదని తెలిపారు.
నిజం ఏదో ఒకరోజు బయటపడుతుందని రాహుల్ అన్నారు. పార్లమెంట్ లో మాట్లాడుతున్న క్రమంలో మోదీ చాలా సార్లు నీళ్లు తాగారని.. నీళ్లు తాగుతున్నప్పుడల్లా ఆయన చేతులు వణికాయని ఎద్దేవా చేశారు. లోక్సభలో తాను అదానీ వ్యవహారాలపై ప్రసంగించిన సమయంలో మోదీ చేతులు వణికాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఎదోఒకరోజు మోదీ మూల్యం చెల్లించుకోకతప్పదని రాహుల్ అన్నారు.