»Patna Girl Write A Letter To Tejashwi Yadav On Her Love Issue
లవర్స్ డే వెళ్తోంది.. నేనింకా సింగిలే: డిప్యూటీ సీఎంకు యువతి లేఖ
ప్రేమికులు అందరూ ఆనందాలతో గడిపే రోజు ఫిబ్రవరి 14. ఈ రోజు కోసం సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. తమ ప్రియమైన వ్యక్తులకు తమ ప్రేమను తెలిపేందుకు ఉన్న ఒక్క రోజును ఎలా గడపాలా? అని ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు. అలాంటి రోజున తన ప్రేమను వ్యక్తం చేద్దామనుకున్న ఆ యువతికి నిరాశే ఎదురైంది.
ప్రపంచ ప్రేమికుల దినోత్సవం (Valentine’s Day) వచ్చేస్తోంది. ప్రేమికులు అందరూ ఆనందాలతో గడిపే రోజు ఫిబ్రవరి 14. ఈ రోజు కోసం సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. తమ ప్రియమైన వ్యక్తులకు తమ ప్రేమను తెలిపేందుకు ఉన్న ఒక్క రోజును ఎలా గడపాలా? అని ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు. అలాంటి రోజున తన ప్రేమను వ్యక్తం చేద్దామనుకున్న ఆ యువతికి నిరాశే ఎదురైంది. తాను ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే తనకు ఉద్యోగం లేదని.. ఇప్పుడు తానేమీ చేయాలని ఏకంగా ఉప ముఖ్యమంత్రి (Deputy CM)కి లేఖ రాసింది. ఈ సంవత్సరం కూడా లవర్స్ డే వెళ్లిపోతుందని.. కానీ తాను ఇంకా సింగిల్ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితికి కారణం మీ ప్రభుత్వమే అంటూ దూషిస్తూ లేఖ రాయడం బిహార్ (Bihar)లో కలకలం రేపింది. ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు వేయకపోవడంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోతున్నానని వాపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు వేసి ఉంటే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉండేదని ఆ యువతి లేఖలో వివరించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్ లోని పాట్నా (Patna) నగరానికి చెందిన యువతి పింకీ (Pinky) (ముద్దుపేరు). ఆమె రచయిత ప్రభాత్ బంధుల్యా (Prabhath Bandhulya)పై మనసు పడింది. అయితే ఇది వన్ సైడ్ లవ్. అయితే పోటీ పరీక్షలకు ఆమె సిద్ధమవుతున్నది. ఉద్యోగం రాకపోవడం వలన నాలుగేళ్లుగా ప్రభాత్ పై ఉన్న ప్రేమను వ్యక్తం చేయలేకపోయింది. ఈ సంవత్సరం వాలంటైన్స్ డే కూడా వెళ్లిపోతుంది. తానేమి ఏం చేయాలని ప్రశ్నిస్తూ బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) కు లేఖ రాసింది. తేజస్వీ యాదవ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే తన ప్రేమకు మీరే అడ్డు అంటూ లేఖ (Letter)లో ఆరోపించింది.
‘మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. మీలాగా నేను చేసుకుందామంటే నా పెళ్లికి నిరుద్యోగం అడ్డంకిగా మారింది. ప్రభాత్ బంధుల్యాపై నాలుగేళ్లుగా వన్ సైడ్ లవ్ ఉంది. ప్రేమలో ఉండాల్సిన వయసులో కరెంట్ అఫైర్స్ చదువుతున్నా. పెళ్లి చేసుకుందామని అడుగుదామంటే నాకు ఉద్యోగం లేదు. ఈ పరిస్థితిలో ఈ ఏడాది వాలంటైన్స్ డే కూడా వెళ్లిపోతుంది గానీ నేను ఇంకా అవివాహిత (Single)గానే ఉన్నా. నేను పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే మా నాన్న మాత్రం పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ పరిస్థితులతో నేను విరక్తి చెందా. ఎన్నో ఆశలతో నేను మీకు ఈ లేఖ రాస్తున్నా. నేను ఉద్యోగం సాధించేందుకు సహాయం చేయండి. లేకుంటే ప్రభాత్ వేరొకరిని పెళ్లి చేసుకుంటాడు. గంపెడంతా ప్రేమ ఉన్నా ఉద్యోగం లేకుంటే ఏమిటీ ప్రయోజనం?’ అని ప్రశ్నించింది.
ఇక ప్రభుత్వ తీరుపైన లేఖలో విమర్శలు చేసింది. చాలాకాలంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా ఉద్యోగాలు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్కసారి కూడా ఉద్యోగ ప్రకటనలు వేయలేదని ఆరోపించింది. ఒకవేళ ప్రకటనలు వేసి పరీక్షలు నిర్వహించినా పేపర్ లీక్ అవుతోందని వాపోయింది. ప్రభుత్వం ఇలా చేయడం వలన తాను ఇంకా ఉద్యోగం సాధించలేదని, ఉద్యోగం పొందకపోవడంతో ఇప్పటికీ ప్రభాత్ కు తన ప్రేమను చెప్పలేకపోతున్నట్లు లేఖలో పింకీ ఆవేదన వ్యక్తం చేసింది.
‘పింకీ పాట్నా, మీ ఓటరు రచయిత ప్రభాత్ వన్ సైడ్ లవర్’ అంటూ లేఖ ముగించింది.
అయితే ఈ లేఖ వైరల్ కావడంతో రచయిత ప్రభాత్ బంధుల్యా వివరణ ఇచ్చాడు. ‘దేవుడి మీద ప్రమాణం. పింకీ నన్ను ఫేమస్ చేసేసింది. దీనికి కృతజ్ఞతలు. నాకు పింకీ ఎవరో తెలియదు. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. నా భార్య నాపై కోపంగా ఉంది. ఈ లేఖలో నిరుద్యోగం అనేది ప్రధానంగా ఉంది. ఇక్కడ నా పేరును ప్రచారానికే వాడుకున్నారు. పింకికీ కావాల్సింది ప్రేమ కాదు, ఉద్యోగం మాత్రమే’ అని ప్రభాత్ ట్వీట్ చేశాడు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
महादेव कसम ! पिंकी ने हमको फेमस कर दिया यार . शुक्रिया ! मैं प्रयास करूंगा कि @yadavtejashwi जी से मेरी मुलाक़ात हो और इस विषय पर संवाद करूँ .