ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా రొంపిచర్లలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాల కోటిరెడ్డిపై కాల్పులు జరిగాయి. రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డికి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనప్రాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది ఎవరో తెలియడం లేదు. రాజకీయ కక్షతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టా...
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఆదరణ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల ప్రముఖులు వచ్చి కేసీఆర్ తో సమావేశమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి వస్తామని ప్రకటించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖులు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు బీఆర్ఎస్ ల...
తెలంగాణ రాజకీయాల్లో రోజుకో పరిణామం జరుగుతోంది. ఇప్పటికే రాజకీయాలు వేడెక్కగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరింత హీటెక్కాయి. తాజాగా ఈ గవర్నర్ వ్యవహారంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల రంగంలోకి దిగనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాజ్ భవన్ లో అపాయింట్ మెంట్ కోరారని పార్టీ వర్గాలు తెలిపారు. గురువారం గవర్నర్ తమిళిసైని షర్మిల కలువనున్నారు....
సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాపింగ్ లను కాదని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి వ్యవహారం, నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై నోరు విప్పారు. చద...
సప్తరుషి పేరుతో కేంద్ర బడ్జెట్ ఏడు ప్రాధామ్యాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ‘అమృత్ కాల్ బడ్జెట్’ అని పిలుస్తున్న ఈ బడ్జెట్ పై మిశ్రమ స్పందన వస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఈ బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరచగా.. బీజేపీ, ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీలు మాత్రం హర్షం వ్యక్తం చేశాయి. భారత్ కు దశదిశ ఇచ్చే అద్భుత బడ్జెట్ గా పేర్కొంటున్నాయి. రాజకీయ పార్టీల మాటలు ఎలా ఉన్నా కానీ ప్రజలు మాత్రం ఆశించేది మాత్రం...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. లోకేశ్ బస చేసిన ప్రదేశానికి వచ్చి బీభత్సం సృష్టించారు. టీడీపీ ఫ్లెక్సీలు చించేసి రచ్చ చేశారు. అనంతరం తెలుగు తమ్ముళ్లపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల...
‘అమృత్ కాల్ బడ్జెట్’ పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వే శాఖ బడ్జెట్ కూడా ఉంది. రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ గతంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవా...
కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన వేళ అందరి కళ్లు ఆర్థిక మంత్రి ధరించిన చీరపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంగా ఆర్థిక మంత్రిపైనే అందరి కళ్లు ఉంటాయి. ఆమె ఏ చీర ధరించారు?.. ఆ చీర ప్రత్యేకత ఏమిటనేది ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈసారి కూడా ‘అమృత్ కాల్ బడ్జెట్’ అనే పేరుతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపైనే చ...
ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ భారీ కుదుపు కుదిపింది. రెండు రోజులుగా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం బహిర్గతం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆడియోలను విడుదల చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? అని నిలదీశారు. అనుమానం ఉన్న చోట తాను ఉండలేను అని ప్రకటించారు. ‘ప్రజా సమ...
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగైందని సినీ నిర్మాత లక్ష్మీపతి, నిర్మాతల సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ ప్రకటించారు. తారకరత్నతో గతంలో ఒక సినిమాను పూర్తి చేశామని.. అతడు కోలుకోగాలనే మరో సినిమా చేస్తామని ప్రకటించారు. గుండెపోటుకు గురైన తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో అతడిని పరామర్శించిన అనంతరం లక్ష్మీపతి, ప్రసన్న కుమార్...
మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వెళ్తోంది. విచారణను వేగవంతం చేస్తున్నది. దర్యాప్తులో భాగంగా వైఎస్ అవినాశ్ రెడ్డితో విచారణ అనంతరం మరికొందరికి నోటీసులు పంపుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎంవోలో అతి ముఖ్యమైన వ్యక్తికి కూడా నోటీసులు పంపడం ఏపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఇంట్లోని మనిషికి నోటీసులు అందడంతో సంచలనంగా మారింది. వివేకా హత్య కేసు మరకలు సీఎం ఇంటిన...
బాలీవుడ్ నటి సన్నీలియోన్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐదారు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు షూటింగ్ జరుగుతుండగా ఆమె కుడికాలి బొటన వేలికి గాయం అయ్యింది. వేలి నుంచి రక్తం బయటకు రావడంతో అక్కడున్న సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేశారు. కాలి వేలికి దెబ్బతగలడమే కాకుండా ఆమె పెదవి కూడా కొద్దిగా చితికినట్లు తెలుస్తోంది. నొప్పిని భరించలేక సన్నిలియోన్ చాలా ఇబ్బంది పడిందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్ర...
ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉందని, గత కొన్ని రోజులుగా ఉదయం, సాయంకాలం వేళల్లో తీవ్రమైన చలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలు దంచి కొడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్ల...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. మోకాలి లిగమెంట్ కు రిషబ్ పంత్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఈ వారంలోనే పంత్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. డిసెంబర్ 30వ తేదిన ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొంది. మొదట డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ...
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా బహిష్కరించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించినట్లు ఆ పార్టీలు తెలిపాయి. అంతే కానీ రాష్ట్రపతికి వ్యతిరేకంగా తాము లేని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవ రావు స్పష్టతనిచ్చారు. ఈ ...