పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బృందం చర్చలు జరిపింది. పార్టీలోకి రావాలని కోరగా.. 10 సీట్లు ఇస్తేనే వస్తా అని పొంగులేటి స్పష్టంచేసినట్టు తెలిసింది.
యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ను హత్య చేసేందుకు నిందితులు టర్కీలో తయారైన పిస్టల్స్ ను వాడినట్లు గుర్తించారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు నేడు 10 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ ప్రభావం ఐటీ స్టాక్స్ పైన కనిపించింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. నాలుగేళ్ల తర్వాత ఏప్రిల్ నెలలో హై పవర్ డిమాండ్ నెలకొంది. పొద్దంతా ఎండలు ఉండగా.. సాయంత్రం ఉక్కపోతతో ఏసీలు, కూలర్లు ఆన్ చేయడంతో పవర్ డిమాండ్ ఎక్కువ అవుతుంది.
వైసీపీ నేతలు... తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి సామాజిక దురాచారాలు జరగడం దారుణం.
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
తన మావయ్యలు చిరు, పవన్, నాగబాబుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు.
ఎండాకాలం కావడంతో ఈ కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోలేదు. సభకు హాజరైన వారికి నీడ సౌకర్యం కల్పించలేదు. తీవ్రమైన ఎండలకు ప్రజలు తాళలేక అస్వస్థతకు గురయ్యాయి. ఏకంగా 600 మంది అస్వస్థతకు లోనయ్యారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ నేడు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించనుంది.
అంబేడ్కర్ జయంతి రోజున స్టాలిన్ తో పాటు పలువురు నేతల పైన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ అర్ ఎస్ భారతి పేర్కొన్నారు.
దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లకు బీసీసీఐ భారీగా ప్రైజ్ మనీని పెంచింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను విచారించారు. దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణ సాగింది.
తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు.