• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Paleru: పాలేరు టిక్కెట్ ఈసారి నాదే..కీలక నేతల వ్యాఖ్యలు

ఖమ్మంలోని పాలేరు(Paleru) ఇటీవల హాట్‌ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి తామంటే తాము పోటీ చేస్తామని అధికార బీఆర్ఎస్(BRS), సీపీఎం(CPM) పార్టీ నేతల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. పాలేరు సీటు సీపీఎం పార్టీకి కేటాయించాలని కేసీఆర్(KCR)ను అడుగుతామని తమ్మినేని ఇటీవల అన్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(tummala nageswara rao), సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాల పార్థసారధి రెడ్డి(kandala pardha sara...

March 26, 2023 / 12:49 PM IST

Rahul Gandhi: అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంకల్ప్ సత్యాగ్రహం

రాహుల్ గాంధీ(rahul gandhi)పై లోక్‌సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీ(delhi)లోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజు సంకల్ప్ సత్యాగ్రహాన్ని(Sankalp Satyagraha) ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నార...

March 26, 2023 / 11:42 AM IST

Visakhapatnam: ఈనెల 28న విశాఖలో జీ20 సమ్మిట్..నేడు మరథాన్ నిర్వహణ

గ్రేటర్ విశాఖపట్నం(Visakhapatnam) మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మార్చి 28, 29 తేదీల్లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆర్కే బీచ్ లో జీ20 సన్నాహక మరథాన్(Marathon) కార్యక్రమం చేపట్టగా.. ఈ కార్యక్రమానికి మంత్రులు గుడివాడ అమర్ నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజనిలు హాజరై ప్రారంభించారు. 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు G20 సమ్మిట్ సందర్భంగా నగరాన్ని సందర్శించవచ్చు.

March 26, 2023 / 10:45 AM IST

Bandi Sanjay: నేటి సిట్ విచారణకు బండి సంజయ్ దూరం!

TSPSC పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌(Bandi Sanjay)కు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆదివారం హాజరు కావాలని సిట్(SIT) తెలిపింది. కానీ ఈరోజు సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు. బండి సంజయ్ తరఫున సిట్ ముందుకు బీజేపీ(BJP) లీగల్ టీమ్ రానుంది.

March 26, 2023 / 10:10 AM IST

ISRO: LVM3-M3 వన్ వెబ్ ఇండియా-2 మిషన్‌ ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రవేశపెట్టిన మరో రాకెట్ LVM3-M3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Centre) నుంచి దీనిని ప్రయోగించారు. LVM3 43.5 మీటర్ల పొడవు, 643 టన్నుల బరువుతో వన్‌వెబ్(OneWeb) యొక్క చివరి విడత 36 Gen1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.

March 26, 2023 / 09:46 AM IST

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత..భయాందోళనలో భక్తులు

తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ఓ చిరుత(leopard) సంచరిస్తోంది. గాలిగోపురం పరిధిలోని మొదటి ఘాట్ రోడ్ 35వ మలుపు వద్ద చెట్ల పొదల్లో చిరుత(Cheetah) కనిపించినట్లు భక్తులు(Devotees) చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భయాందోళన చెందుతున్నారు.

March 26, 2023 / 08:26 AM IST

Celebrity Cricket League 2023: నాలుగోసారి విజేతగా తెలుగు వారియర్స్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)2023 చాంపియన్ షిప్ ను తెలుగు వారియర్స్(Telugu Warriors) నాలుగో సారి గెల్చుకుని రికార్డు సృష్టించింది. నిన్న విశాఖలో జరిగిన ఫైనల్ మ్యాచులో భోజ్‌పురి దబాంగ్స్‌(Bojpuri Dabanggs)పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

March 26, 2023 / 07:52 AM IST

PM MODI: మరోసారి ప్ర‌ధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం..వీడియో వైరల్

కర్ణాటక(Karnataka)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) రోడ్ షోలో పాల్గొనగా మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. శనివారం కర్ణాటకలోని దావణగిరిలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ(Rally)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.

March 25, 2023 / 09:17 PM IST

CORONA ALERT: మళ్లీ కరోనా టెన్షన్..ఆ రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు(Corona New Cases) అధికంగా నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా(Corona)తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలిపింది.

March 25, 2023 / 06:48 PM IST

CM Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం… రూటు మార్చిన సీఎం జగన్..!

CM Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం సీఎం జగన్ పై బాగా ఎక్కువగా పడిందనే చెప్పాలి. ఈ ప్రభావం ఆయన ఈ రోజు దెందులూరు సభలో స్పష్టంగా కనపడుతోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.... సీఎం జగన్ ఈ రోజు దెందులూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

March 25, 2023 / 06:13 PM IST

Mango Prices: నగర వాసులకు బ్యాడ్ న్యూస్..పెరగనున్న మామిడి ధరలు!

అడపాదడపా కురుస్తున్న వర్షాల(rains) కారణంగా వేసవి తాపం నుంచి నగరవాసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, మామిడి ప్రియులకు(mango lovers) మాత్రం ఇది చేదువార్త అని చెప్పవచ్చు. అకాల వర్షాలు సహా చీడ పీడల కారణంగా మామిడి పండ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మామిడి పండ్ల సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు(prices) ఎక్కువగా ఉంటాయని, వాటిని కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారే అవకాశం ఉంది.

March 25, 2023 / 02:43 PM IST

Rahul Gandhi: నా తర్వాత ప్రసంగం గురించి మోదీ భయపడుతున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) తన తదుపరి ప్రసంగానికి భయపడి అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఆయన కళ్లలో భయం కనిపించిందని, అందుకే తనను పార్లమెంట్‌లో మాట్లాడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యాన్ని తాను కోరినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

March 25, 2023 / 02:01 PM IST

Jagan: బాబు గతంలో రుణాలు కట్టొద్దని మహిళలను తప్పుదొవ పట్టించారు

ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్(ap cm jagan) బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ క్రమంలో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబు (chandrababu naidu)మాత్రం మహిళలకు డ్వాక్రా రుణాలు(dwcra loans) కట్టవద్దని తప్పుదొవ పట్టించారని జగన్ అన్నారు.

March 25, 2023 / 01:17 PM IST

Bandi Sanjay: నిరుద్యోగులకు రూ.లక్ష నిరుద్యోగ భృతి ఇవ్వాలి

తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేపీ(BJP) తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. మరోవైపు TSPSC లికేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరిపించడం లేదని సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. లేదంటే ట్విట్టర్ టిల్లు ఈ కేసుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

March 25, 2023 / 12:48 PM IST

AP TDP నేత చింతకాయల విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు

ఏపీ టీడీపీ నేత చింతకాయల విజయ్(Chintakayala Vijay)కి సీఐడీ(CID) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల అంశంపై మార్చి 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

March 25, 2023 / 12:14 PM IST