సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli) ప్రముఖ మొబైల్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. అధికారిక ధృవీకరణ కోసం వేచి ఉండగా, రాజమౌళి నటించిన ప్రకటన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అభిమానులలో సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో నిమ్స్ ట్విన్ టవర్ల(Nims Twin Towers)కు తెలంగాణ సీఎం కేసీఆర్(cm kcr) భూమి పూజ చేశారు. దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం భూమిపూజ నిర్వహించారు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీలకు 9 వస్తువులతో కూడిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఆరుగురికి అందజేశారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు వె...
AP EAMCET 2023 రిజల్ట్స్ విడుదలయ్యాయి. విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు ప్రకటించారు.
వర్ధమాన తార శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) తన అద్భుతమైన నటనా నైపుణ్యాలతోనే కాకుండా తన ఫ్యాషన్ ఎంపికలతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
ఏలూరు విద్యానగర్లో దారుణం జరిగింది. ఓ వివాహితపై పలువురు దుండగులు నిన్న రాత్రి యాసిడ్ దాడి చేశారు. రాత్రి ఆ మహిళ స్కూటిపై వెళుతుండగా దుండగులు ఆపి ముఖంపై దాడి చేశారు. బైక్ ను ఆపి యాసిడ్ చల్లి గుర్తుతెలియని వ్యక్తులు పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర గాయాలైన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె స్థానిక డెంటల్ క్లినిక్ లో రిసెప్షనిష్టుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెను మ...
టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Varun tej Lavanya)లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి. వీరు ప్రేమించుకుంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా, వారు స్పందించలేదు. తాజాగా ఎంగేజ్మెంట్ ...
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు ఈడీ సోదాలు నిర్వహించి అతన్ని అరెస్టు చేసింది. మంత్రి ఉద్యోగాల కోసం అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ 'ఆదిపురుష్(Adipurush)' విడుదలకు మరో రెండు రోజులే ఉంది. జూన్ 16 దగ్గర పడుతుండగా, రాముడి పాత్రలో ప్రభాస్‌ని చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆదిపురుషం టిక్కెట్ల ధర పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అసలు టిక్కెట్ ధరకు అదనంగా రూ.50 టిక్కెట్లను విక్రయించవచ్చు.
ఉత్తర నైజీరియా(Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ(boat) ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు 103 మంది మరణించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి(kp chowdary)ని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కేపీ చౌదరి గత కొంత కాలంగా గోవాలో ఉంటున్నారు. కబాలి తెలుగు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
బ్యాంకుల మోసం, మనీలాండరింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ టి. వెంకట్‌రామ్‌రెడ్డి(Venkatrami Reddy)తోపాటు ప్రమోటర్లను కూడా ఈడి మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై మే 25న జారీ చేసిన లీగల్ నోటీసును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) మంగళవారం పేర్కొంది.
భువనగిరి BRS ఎమ్యెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekar Reddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇల్లు, ఆఫీసులో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఒకే సమయంలో దాదాపు 70 మంది ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు భువనగిరి ...
ఏపీలోని అనకాపల్లి-తాడి రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆ క్రమంలో ఐదు బోగీలు పక్కకు జరిగిపోగా ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే ఐదు రైళ్లను రద్దు చేశారు. దీంతోపాటు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కూడా మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్రయ...
మన శరీరం ఎముకలు, మాంసాలతో నిర్మితమైంది. అవి సక్రమంగా పనిచేయడానికి రక్తం అవసరం. శరీరానికి సరిపడా రక్తం అందకపోతే ప్రాణానికే ప్రమాదం. శరీరానికి రక్తం అవసరమైనప్పుడు సకాలంలో రక్తాన్ని సరఫరా చేస్తే, వ్యక్తి జీవితాన్ని రక్షించవచ్చు. సరైన సమయంలో రక్తం అందకపోతే ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది.