AP EAMCET 2023 ఫలితాలు ఈరోజు(జూన్ 14న) విడుదలయ్యాయి. జేఎన్టీయూ అనంతపురం (JNTUA) నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు ఫలితాలను విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు. అధికారిక వెబ్ సైట్ నుంచి ఇక్కడ క్లిక్ చేసి cets.apsche.ap.gov.in , manabadi.com ద్వారా ఫలితాలను తనిఖీ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. JNTUA మే 15 నుంచి 19, 2023 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరపున AP EAMCET పరీక్షను నిర్వహించింది. EAMCET ఫలితాలను తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
AP EAMCET 2023 ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఇంజనీరింగ్ విభాగంలో 76.32% కాగా, వ్యవసాయం & ఫార్మసీ విభాగాలలో 89.65% నమోదైంది.
AP EAMCET 2023 ఫలితాల్లో అగ్రికల్చర్ టాపర్స్
1. బి జస్వంత్ : 153.88/160
2. బోరా వరుణ్ చక్రవర్తి: 151/160
3. కొన్ని రాజ కుమార్: 151/160