హైదరాబాద్ ఎర్రమంజిల్లో నిమ్స్ ట్విన్ టవర్ల(Nims Twin Towers)కు తెలంగాణ సీఎం కేసీఆర్(cm kcr) భూమి పూజ చేశారు. దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం భూమిపూజ నిర్వహించారు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీలకు 9 వస్తువులతో కూడిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఆరుగురికి అందజేశారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు గర్భిణీ స్త్రీలకు రెండు సార్లు ఇస్తామని వెల్లడించారు. కడుపులో బిడ్డ పడితే న్యూట్రిషన్ కిట్లు, కడుపులో నుంచి బిడ్డ బయట రాగానే బయటకు వస్తే కేసీఆర్ కిట్ ఇస్తామని పేర్కొన్నారు.
నిమ్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు ఇది. 60 ఏళ్లలో కొత్త ఆస్పత్రులను గత ప్రభుత్వాలు నిర్మించలేదు. 10 వేల పడకలతో రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రం వచ్చినప్పుడు 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు 8340 సీట్లు ఉన్నాయని ఈ సందర్భంగా హరీశ్ రావు పేర్కొన్నారు.
పేద మహిళ గర్భిణిగా ఉన్న సమయంలోనూ కూలి పనులకు వెళితే తప్ప కుటుంబం(family) గడవని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాబోయే అమ్మను భద్రంగా చూసుకునేందుకు, తగిన విశ్రాంతి, పోషకాహారం తీసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్(kcr kit)లో భాగంగా పన్నెండు వేల రూపాయలను విడుతలవారీగా అందిస్తున్నదని పేర్కొన్నారు.