»Kabali Producer Kp Chowdary Arrested In Drug Case
Kabali producer: డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత అరెస్ట్
డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి(kp chowdary)ని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కేపీ చౌదరి గత కొంత కాలంగా గోవాలో ఉంటున్నారు. కబాలి తెలుగు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి(kp chowdary)ని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠాను పట్టుకున్న క్రమంలో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీ చౌదరి గత కొన్ని రోజులుగా గోవాలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. కేపీ చౌదరి డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కబాలి తెలుగు చిత్రానికి కేపీ నిర్మాతగా ఉన్నారు. ‘కబాలి’ తెలుగు వెర్షన్ పంపిణీ హక్కులను షణ్ముఖ ఫిల్మ్స్ బ్యానర్‌పై 32 కోట్ల భారీ ధరకు కెపి చౌదరి, ప్రవీణ్ వర్మ దక్కించుకున్నారు.
కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు(drugs case) సంచలనం సృష్టించింది. పూరీ జగన్నాథ్, ఛార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్ వంటి పలువురు సినీ ప్రముఖులను ఇప్పటికే ఈడీ విచారించింది. చివరకు వీరంతా డ్రగ్స్ వాడలేదని ఫోరెన్సిక్ రిపోర్టు రావడంతో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా ఈ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.