ఏపీలోని అనకాపల్లి-తాడి రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆ క్రమంలో ఐదు బోగీలు పక్కకు జరిగిపోగా ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే ఐదు రైళ్లను రద్దు చేశారు. దీంతోపాటు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కూడా మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు అందుబాటులో ఉన్న రైళ్ల గురించి సమాచారం తెలుసుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచించారు.