తెలంగాణను రుతుపవనాలు తాకాయి. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల తాకిడి వల్ల ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
నిద్రపోతున్న ఓ మహిళకు హార్ట్ రేట్ వేగం పెరిగింది. అలా పది నిమిషాల పాటు ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటూ ఉంది. మరికొంత సమయం అయ్యుంటే ఆమె ప్రాణాలు పోయేవి. అయితే ఆమె వేసుకున్న యాపిల్ యాప్ తన ప్రాణాలను కాపాడింది. హార్ట్ రేట్ పెరిగిందని అలారం ద్వారా యాపిల్ వాచ్ తెలుపడంతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది.
ఖాళీగా ఉన్న ఓ ఇంటికి రూ.7.7 లక్షల వరకూ కరెంట్ బిల్లు వచ్చింది. విద్యుత్ అధికారులకు సమస్యను విన్నవించినా సరైన సమాధానం లేదు. విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరిగినా నిర్లక్ష్యపు సమాధానమే వినిపించింది. సమస్యను సట్టించుకునేవారే లేక ఉప్పల్ లోని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
విశాఖపట్టణంలో జ్ఞానానంద ఆశ్రమంలో కీచక పర్వం వెలుగుచూసింది. ఆశ్రమంలో ఆశ్రయం కోసం వచ్చిన ఓ బాలికపై పూర్ణానంద స్వామిజీ లైంగికదాడికి తెగబడ్డాడు. అక్కడినుంచి బయటపడ్డ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వామిజీని అరెస్ట్ చేశారు.
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ జూన్ నెల జీతం నుంచే అందనున్నాయి.
పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో ఓ మహిళ అపచారం చేసింది. శివలింగంపై ఆ మహిళ నోట్ల కట్టలను చల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదిపురుష్ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఆదిపురుష్ డైలాగ్స్ మరో వారం రోజుల్లో మార్చి ప్రదర్శితమవుతున్న సినిమాలో చేరుస్తున్నట్లు తెలిపారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య వాదనలు జరుగుతున్నాయి. నటులు సినిమాల కోసం అడ్వాన్స్ లు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదని నిర్మాతలు రచ్చకెక్కారు. దీనిపై విచారణ జరగనుంది. ఇందులో నటులకు రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది.