విశాఖపట్టణంలో జ్ఞానానంద ఆశ్రమంలో కీచక పర్వం వెలుగుచూసింది. ఆశ్రమంలో ఆశ్రయం కోసం వచ్చిన ఓ బాలికపై పూర్ణానంద స్వామిజీ లైంగికదాడికి తెగబడ్డాడు. అక్కడినుంచి బయటపడ్డ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వామిజీని అరెస్ట్ చేశారు.
విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో కీచక పర్వం
బాలికపై పూర్ణానంద స్వామిజీ లైంగికదాడి
రెండేళ్ల క్రితం ఆశ్రమంలో చేరిన బాలిక
అర్ధరాత్రి లైంగికదాడి, ఎదురు తిరిగితే గొలుసులతో బంధించి దాడి
ఈ నెల 13వ తేదీన పనిమనిషి సాయంతో బయటపడ్డ బాలిక
విజయవాడ దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
పోక్సో కేసు నమోదు, వైజాగ్లో స్వామిజీ అరెస్ట్