BRS Mla: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (shekar reddy), మర్రి జనార్ధన్ రెడ్డికి (janardhan reddy) ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. నగదు లావాదేవీలు, వ్యాపార ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని అందులో కోరింది. ఇటీవల వీరి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు 84 గంటల పాటు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై కూడా రైడ్స్ చేశారు. ఆ రోజు సేకరించిన డేటాతో తాజాగా నోటీసులు జారీచేసింది. ఇటీవల జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల ఆధారంగానే నోటీసులు ఇచ్చారు. ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. ఈ రోజు మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విచారణకు రానుండగా.. గురువారం రోజున పైళ్ల శేఖర్ రెడ్డి విచారణకు వచ్చే అవకాశం ఉంది.