తమిళనాడులో స్టాలిన్ సర్కార్ ఎన్నికల హామీల్లో భాగంగా 500 మద్యం దుకాణాలను మూసి వేయనుంది. రేపటి నుంచి తొలి విడతగా 500 దుకాణాలు మూత పడనున్నాయి.
భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా ఎండవేడికి తాళలేకపోయిన ప్రజలకు ఊరట లభించింది. పలు చోట్ల చిరుజల్లులు కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో వానలు కురియనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో కొత్త పార్టీని ప్రకటించాడు. గద్దర్ ప్రజా పార్టీ అని తన పార్టీకి నామకరణం చేశాడు. రానున్న ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని తెలిపాడు.
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 12 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ(ED) అధికారులు పలు కాలేజీలపై సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో 15 చోట్ల తనిఖీలు చేపట్టారు. కామినేని గ్రూపు సంస్థల కార్యాలయాలు, పలువురు ప్రముఖులకు చెందిన వైద్య కళాశాలలు, నివాసాలపై ఈడీ బుధవారం దాడులు చేపట్టింది.
ఈ రోజుల్లో ఎసిడిటీ చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, చెడు ఆహారం కారణంగా ప్రజలు ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఒకసారి మొదలుపెడితే, ఈ ఎసిడిటీని వదిలించుకోవడం కష్టం. ఎసిడిటీ వల్ల గుండెల్లో మంట, వికారం, వాంతులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి అనేక సమస్యలు వస్తాయి. ప్రజలు ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి మందులు తీసుకుంటారు. మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే, దుష్ప్రభావాలు...
సీఎం జగన్ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీలో 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగున్న వారికే టికెట్ కేటాయిస్తానని స్పష్టం చేశారు. వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని, అందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని తెలిపారు. తీరు మార్చుకోని ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
5G ఆవిర్భావంతో నెట్‌వర్క్ స్పీడ్ వేగంగా మారింది. Airtel, Jio వంటి కంపెనీలు కూడా అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 5G నెట్ వర్క్ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో 5జీ ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఐఫోన్ 12 మంచి ఆఫర్ ధరకు లభ్యమవుతుంది.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. తన కుటుంబాన్ని కిడ్నాపర్లు దారుణంగా హింసించినట్లు తెలిపారు. క్రూరంగా ఇబ్బంది పెట్టి తమ నుంచి డబ్బులు లాక్కున్నారని, ఆ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ, అతని లీల మూవీతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం 2020లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత DJ టిల్లు భారీ థియేట్రికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా టిల్లూ స్క్వేర్‌తో రాబోతున్నాడు. కానీ ఇంకొన్ని సినిమాల విషయంలో టిల్లు రాంగ్ స్టెప్ వేశాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు ఏడు నెలల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ నేడు కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ సైతం లాభాల్లో కొనసాగుతోంది.
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం(yadadri temple)లో ఈరోజు చిరుధాన్యాల ప్రసాదం(మిల్లెట్స్), బంగారం, వెండి నాణేల( డాలర్) విక్రయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ యువ ఇంజనీర్ చెంపచెల్లుమనిపించారు. మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ ఇద్దరు ఇంజనీర్లను విచారించి, వారిలో ఒకరిని కొట్టగా..ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.
అచ్చం తెలుగు అమ్మయిలా కనిపించే అవికా గోర్ సోషల్ మీడియాలో ఫలు యాక్టివ్ అయ్యింది. ముంబయిలో జన్మించిన ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఆకట్టుకుంటుంన్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
హోండురాస్(honduras)లోని మహిళా జైలులో జరిగిన అల్లర్లలో 41 మంది మహిళలు చనిపోయారు. వీరిలో అనేక మంది అగ్నికి ఆహుతి కాగా. ఇంకొంత మంది బాధితులు కాల్చివేయబడ్డారు.
హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్ కూలింది. నిర్మాణ పనులు జరుగుతుండగా స్లాబ్ కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు గాయపడ్డారు.