బీఆర్ఎస్ పార్టీలో యువనేతగా ఉన్న ఫోక్ సింగర్ సాయిచంద్(39) గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలసి నాగర్ కర్నూల్ జిల్లాలోని తన పొలానికి వెళ్లిన సాయిచంద్ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
త్రిపురలో ఘోరం జరిగింది. జగన్నాథ రథయాత్రలో విద్యుత్ షాక్ తో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.
తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో క్షుద్రపూజల కలకలం రేపింది. ఈ ఘటనతో విద్యార్థి సంఘాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. తాజాగా కేటీఆర్, అసదుద్దీన్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో గంటపాటు భేటీ అయ్యారు. ఈ గంట భేటీలో ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయనతో ఉన్న 70 మందికి గాయాలు అయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు.
మరో రెండు రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. యాత్రకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేంద్రం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
స్పై మూవీ హీరోయిన్ సన్యా ఠాకూర్ తన అందాలతో యువతను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పలు యాడ్స్ లలో అలరించిన ఈ భామ ఇప్పుడు పలు సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) భాగ్ సాలే(Bhaag Saale) చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసి ఈమేరకు సినిమా టీంను మెచ్చుకున్నారు. ఈ మూవీలో కిరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా యాక్ట్ చేస్తున్నాడు.
స్టార్ హీరో షారుఖ్ ఖాన్, అతని కుమార్తె సుహానా ఖాన్‌తో అతని సంబంధం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
కమ్మ, వెలమ కులసంఘాలకు భూమి కేటాయించడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్పష్టంచేసింది.
మీరు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే త్వరలోనే యూట్యూబ్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే YouTube "ప్లేబుల్స్" ఆ ఫీచర్‌ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఇది త్వరలోనే వినియోగదారులకు నేరుగా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
ఆలయంలో ఉచితంగా కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం కూడా ప్రస్తుతం ఇరవై రూపాయలు ఇస్తే కానీ జరగడం లేదు. అవును ఈ సంఘటన ఎక్కడో కాదు. ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చోటుచేసుకుంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వాహనం నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి నదిలో పడింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 20 మందికిపైగా గాయపడ్డారు.
పెళ్లి ఊరేగింపుగా వేళుతున్న బృందంపై వేగంగా వస్తున్న ఓ ట్రక్ దూసుకొచ్చింది. ఆ క్రమంలో ఐదుగురు మంది మృతి చెందగా..మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.