»Shahrukh Khan With His Daughter Suhana For A Film
ShahRukh Khan: కూతురితో షారూక్.. మంచి ప్లానింగే..!
స్టార్ హీరో షారుఖ్ ఖాన్, అతని కుమార్తె సుహానా ఖాన్‌తో అతని సంబంధం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
షారుక్ ఖాన్(ShahRukh Khan) ఇటీవల తన కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో నటించారు. ఆర్యన్ తన తండ్రిని ఒక వాణిజ్య ప్రకటన కోసం దర్శకత్వం వహించాడు. ఈ ప్రకటన కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానా(Suhana)తో కలిసి సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. సుహానా ప్రస్తుతం జోయా అక్తర్ దర్శకత్వంలో ఆర్చీస్ అనే వెబ్ సిరీస్‌తో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్, సుహానా ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారట. అయితే, వారి పాత్రలు ఎలా ఉంటాయి అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల పఠాన్ మూవీతో హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఓకే అయిపోయిందని, షారుఖ్(ShahRukh)కి కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ని కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే సుహానాకి ఇంకా కథ చెప్పినట్టు, ఆమె నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం లేదు. అయితే ఈ వార్త తెలియడంతో తండ్రి కూతుళ్లు కలిసి నటిస్తే చూడాలని ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కథ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో తెలియాల్సి ఉంది.