Telangana High Court Stay On Allotment Of Land For Caste Base
Telangana High Court: కుల సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భూముల కేటాయించడాన్ని హైకోర్టు (Telangana High Court) తప్పు పట్టింది. కమ్మ, వెలమ సంఘాలకు భూమి కేటాయించడంపై స్టే విధించింది. కులాలవారీగా ల్యాండ్ అలాట్ చేయడం సరికాదని పేర్కొంది. ఈ విధంగా భూమి కేటాయించడం ఓ విధమైన కబ్జా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు అని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. భూముల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉందని తెలిపింది. ఈ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే కొనసాగుతోందని ధర్మాసనం స్పష్టంచేసింది.