ఈరోజు(july 29th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలను అధికారులు శుక్రవారం రాత్రి జారీ చేశారు. గోదావరి వరద నీటిమట్టం 53 అడుగులకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి నది ప్రవహిస్తున్న నేపథ్య...
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్ల నడుమ నడిచే 36 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
పట్టపగలు ఓ యువకుడు(28) తనతో పెళ్లికి ఒప్పుకొలేదని ఓ యువతిని(25) రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర 2(Bharat Jodo Yatra 2)ను నిర్వహించేందుకు కాంగ్రెస్(congress) నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పాదయాత్ర సెప్టెంబర్ మాసంలో మొదలు కానున్నట్లు తెలిసింది.
స్టార్ హీరో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌కు గురువుగా ఎలా మారాడు. సినిమా బ్రో అనే టైటిల్ ఎలా పెట్టారు? అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో చుద్దాం.
తెలంగాణాలో జులై 22 నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వానలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో 19 మందికిపైగా మరణించారు.
ఏపీలో పవన్ కళ్యాణ్ వలన మిస్ అయిన అమ్మాయిలు ఎంతమందో లెక్క తేలాలన్నారు మంత్రి రోజా. చంద్రబాబు నిజమైన రాయలసీమ ద్రోహి అని, గంజాయి, ఎర్రచందనం నారావారిపల్లిలో దొరుకుతాయని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ భామ, బ్రో మూవీ హీరోయిన్ కేతికా శర్మ హాట్ చిత్రాలతోపాటు తన బయోగ్రఫీ గురింంచి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. తక్కువ సమయంలోనే పవన్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ గురించి ఇప్పుడు చుద్దాం.
నగరం నీట మునగడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఎన్ఎస్‌యూఐ.. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఇదేనా డల్లాస్ అని ప్రశ్నించగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సీరియస్ గా వెళ్లిపోయారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లతోపాటు ఆయా బాధితులకు 25 కిలోల బియ్యం, ఉల్లిగడ్డ, బంగాళదుంపలు, కిలో పామాయిల్ నూనె సహా తదితర వస్తువులు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతోపాటు ఇళ్లు దెబ్బతిన్న వారికి కూడా ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
అమెజాన్ మరో సరికొత్త డీల్స్ తో ముందుకొస్తుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ డీల్ ఆగస్టు 5 నుంచి 9 వరకు కొనసాగనుంది. అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ డీల్లో ఖాతాదారులకు ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఫ్యాషన్, బ్యూటీ బేసిక్స్, హోమ్, కిచెన్, టీవీలతో సహా పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
తెలంగాణలోని ములుగు జిల్లాలో గురువారం నాటి వరదల కారణంగా తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని జంపన్నవాగు వాగు నుంచి ఐదు మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతులంతా పొరుగున ఉన్న ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందినవారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, మరొకరు కొండాయి సర్పంచ్ సమీప బంధువైన సమ్మక్కగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారు త...
ఓ సరస్సులో పరిమితికి మించిన ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా నీటి మునిగింది. ఆ ఘటనలో 26 మంది జలసమాధి అయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపడుతున్నారు.
ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ ను పట్టించుకోకుండానే విమానం వెళ్లిపోయింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆయన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు గవర్నర్ సిబ్బంది కూడా దీనిపై ఫిర్యాదు చేశారు.