భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు.
వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. దీంతో కాలనీ వాసుల ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆగష్టు 4 న విడుదల కావాల్సి ఉండగా..ఇది వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించారు.
పూరిజగన్నాధ్ డైరెక్షన్‌లో ఇస్మార్ట్ శంకర్‌కు సిక్వెల్‌గా వస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌ను ప్రేమించి త్వరలో పెళ్లి చేసుకుంటుంది. అయితే వరుణ్ కు ముందే లావణ్య మరో హీరోను ప్రేమించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సౌత్ ఇండియాలో మీకు ఇళ్లు అద్దెకు కావాలంటే రూ.25 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అవును మీరు విన్నది నిజమే. అది ఇళ్లు కొనడానికి కాదు. కేవలం అద్దె కోసం ఈ రేటు. ఇంత ధర ఎక్కడ? అసలు ఎందుకో ఇప్పుడు చుద్దాం.
మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో కొన్ని చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొహర్రం ఊరేగింపు సమయంలో ఆంక్షలు ఉంటాయని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఈరోజు మొహరం(Muharram) పండుగ. అయితే ఈ పండుగ ఊరేగింపుకోసం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఓ ప్రాంతానికి చేరారు. ఆ క్రమంలో వారిలో కొంత మందికి విద్యుత్ వైర్ తాగి కరెంట్ షాక్(Electric shock) కొట్టింది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది.
తమిళనాడులో బాణాసంచా గోడౌన్‌లో భారీ పేలుడు జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. ఆ క్రమంలో ఓ బస్సును మరొకటి ఓవర్ టేక్ చేసే సమయంలో రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి(accident). దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.
బీజేపీ జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్‌ను తీసుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
సినీయర్ కాంగ్రెస్ నేత కుమారుడు తన భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్ట్‌మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సూపర్‌స్టార్ రజినీకాంత్ సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad owner) యజమాని కావ్య మారన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో తన జట్టు ఓడిపోవడాన్ని చూసి ఆమె భావోద్వేగాలను చూడలేకపోయానని పేర్కొన్నారు.
24 సంవత్సరాల తరువాత మళ్లీ విద్యుత్ ఉద్యోగస్తులు నిరసనలు చేస్తున్నారు. వేతన సవరణతో సహా 10 డిమాండ్లతో గత రెండు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
స్టార్ హీరో పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej), కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన తెలుగు చిత్రం బ్రో(BRO) నిన్న(జులై 28)న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్షన్స్ సాధించిందో ఇప్పుడు చుద్దాం.