ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (సమృద్ధి మహామార్గ్) పనులు జరుగుతున్న షాపూర్‌లో గిర్డర్‌పై క్రేన్ ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో 17 మంది కార్మికులు మృత్యువాత చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సొంత జిల్లా థానే(thane district)లో చోటుచేసుకుంది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ ఇక మారనుంది. అవును ప్రస్తుతం ఆరోగ్య ఫీచర్లతో కూడిన స్మార్ట్ రింగ్(samsung galaxy Ring)లు త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. దీంతో వీటిని ధరించి హెల్త్ ట్రాకింగ్ సహా అనేక విషయాలు తెలుకోవచ్చని అంటున్నారు. అందుకోసం ప్రముఖ సంస్థ శాంసంగ్ స్మార్ట్ రింగ్ లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిసింది.
శనివారం జరిగిన రెండో వన్డేలో ఓటమి నుంచి పుంజుకుని ఆతిథ్య వెస్టిండీస్‌పై మంగళవారం జరగనున్న మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా సిరీస్ విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. మొదటి వన్డేలో భారత్ గెలుపొందగా, వెస్టిండీస్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
ఈరోజు(august 1st 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
తెలంగాణ కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించింది.
తెలంగాణలోని విద్యార్థి సంఘాలు ప్రభుత్వ బడుల్లో అడుగు పెట్టకూడదని డీఈఓలకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరస అవకాశాలతో దూసుకుపోతున్న నటి కియారా అద్వానీ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో అందమైన నటిలో కియారా కూడా ఒకరు. ఆమె లుక్స్ మాత్రమే కాదు, నటనతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. అయినా, తన సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా దూసుకుపోతూనే ఉంది.
చంద్రముఖి 2(Chandramukhi 2)తో సినీ ప్రేమికులను అలరించేందుకు రాఘవ లారెన్స్ వస్తున్నాడు. రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం చంద్రముఖికి సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఇటివల కాలంలో ప్రతి దానిలో కూడా కల్తీ చేయడం పలువురు వ్యాపారులకు సాధారణం అయిపోయింది. ఉప్పు, పప్పు, పసుపు, కారం నుంచి మొదలుకుని నూనె, అయిల్, పెట్రోల్ ను కూడా కల్తీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
జులై నెలలో చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో బేబీ, సామాజవరగమన, బ్రో సినిమాలు ప్రేక్షుల నుంచి మంచి ఆధారణ అందుకున్నాయి. అలాగే ఈ వారం కూడా చాలా సినిమాలే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
యంగ్ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) రాబోయే యాక్షన్ మూవీకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(GangsofGodavari) టైటిల్ టీజర్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ మునుపెన్నడూ చూడని లుక్లో క్రేజీగా కనిపిస్తున్నారు.
పాములు పట్టే వ్యక్తి పాము కాటుకు గురై మరణించినట్లుగా, సాహసం చేసే వ్యక్తి మరో సాహసం చేస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడి మృత్యువాత చెందాడు. ఈ ఘటన హంకాంగ్‌లో ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ 68వ అంతస్తు నుంచి ప్రపంచ సాహసికుడు రెమీ లుసిడి చేసిన సందర్భంలో జరిగింది.
వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గత ఏడాది హైదరాబాద్లో నిర్వహణ సరిగ్గా చేయలేదని అందుకే వచ్చే ఏడాది నిర్వహించనున్న దానిపై క్లారిటీ రాలేదని తెలుస్తోంది. గతంలో నిర్వహించిన సమయంలో జరిగిన లోపాలు సరిచేస్తేనే వచ్చే ఏడాది ఈ రేసు నిర్వహించే సూచనలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
స్పీడుగా వెళుతున్న కారు ఆకస్మాత్తుగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాదఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది.