నమ్మించి మోసం చేశాడని ఓ ఎమ్మెల్యేపై అతడి స్నేహితురాలు సంచలన ఆరోపణలు చేసింది. తన ఎన్నికల కోసం డబ్బును సేకరించేందుకు ఎమ్మెల్యే సెక్స్ రాకెట్ కూడా నిర్వహిస్తున్నాడని గతంలో ఆరోపించిన ఆమె ప్రస్తుతం అతడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె వాదనలు విన్న కోర్టు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ పార్టీ ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్ పై అతడి స్నేహితురాలు సోమాలిక దాస్ (29) పోలీసులను ఆశ్రయించింది. 2022 మే 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఈ వ్యవహారంపై సోమాలిక దాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. బిజయ్ శంకర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడు. అనంతరం జగత్ సింగ్ పూర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా వివాహం సమయంలో ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్ కనిపించకుండాపోయాడని ఆమె ఆరోపించింది. దీనిపై సాక్ష్యాధారాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని జగత్ సింగ్ పూర్ పోలీసులను ఆదేశించింది.