world boxing championగా నిఖత్ జరీన్..రెండోసారి టైటిల్ కొట్టి రికార్డ్
Nikhat zareen:భారత బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat zareen) మరో రికార్డు సృష్టించారు. భారత్ తరఫున రెండోసారి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచారు. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ తమ్ గుయెన్‌పై 5-0 తేడాతో గెలుపొందారు. ప్రత్యర్థిపై పవర్ పంచ్‌లతో నిఖత్ జరీన్ విరుచుకుపడ్డారు.
Nikhat zareen:భారత బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat zareen) మరో రికార్డు సృష్టించారు. భారత్ తరఫున రెండోసారి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచారు. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ తమ్ గుయెన్‌పై 5-0 తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్ ఢిల్లీలో (delhi) గల కేడీ జాదవ్ ఇండోర్ హాల్లో జరిగింది. ప్రత్యర్థిపై పవర్ పంచ్‌లతో జరీన్ విరుచుకుపడ్డారు. గతేడాది కూడా గోల్డ్ మెడల్ సాధించారు. మరోవైపు నిన్న భారత బాక్సర్లు నీతూ, స్వీటీ కూడా గోల్డ్ మెడల్స్ సాధించిన సంగతి తెలిసిందే.
స్ట్రాంద్జా మెమోరియల్ టోర్నమెంట్ 2022 కూడా జరీన్ గెలుచుకున్నారు. గతేడాది కామన్ వెల్త్ గేమ్స్‌లో కూడా మంచి ప్రతిభ కనబరిచారు. మెరీ కోమ్ తర్వాత పలు గోల్డ్ మెడల్స్‌ను నిఖత్ జరీన్ సాధించారు. లండన్ ఒలింపిక్స్‌లో మెరీ కోమ్ (Mary Kom) బ్రౌంజ్ మెడల్ సాధించారు. కెరీర్లో ఆరు గోల్డ్ మెడల్స్ (gold medals) దక్కించుకున్నారు. 2018లో ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో మెడల్ సాధించారు.