»Nia Searches In More Than 60 Places In Kerala Tamil Nadu Karnataka Investigation Into The Koyambattur Blast
NIA: కేరళ, తమిళనాడు, కర్ణాటకలో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు..ఆ పేలుళ్లపై దర్యాప్తు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేరళ, తమిళనాడు, కర్ణాటకలో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. కోయంబత్తూరు కారు పేలుడు కేసు, మంగళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు దాడులపై అనుమానిత ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహిస్తున్నారు.
కోయంబత్తూరు కారు పేలుడు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో చెన్నై(Chennai) నగరంతోపాటు తమిళనాడు(tamilanadu)లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు(NIA searches) నిర్వహిస్తోంది. దీంతోపాటు కేరళ, కర్ణాటకలోని ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపడుతుంది. మొత్తంగా 60కిపైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పేలుడు దాడి వెనుక ఐసిస్(ISIS) సానుభూతిపరులు కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేంద్ర ఏజెన్సీ NIA చేపట్టిన భారీ సోదాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని స్థానిక అధికారులు అందుకు ఏర్పాట్లు చేసి అప్రమత్తమయ్యారు.
2022 అక్టోబర్లో దీపావళి పండుగ సందర్భంగా కోయంబత్తూరు(coimbatore)లోని కొట్టై ఈశ్వరన్ దేవాలయం సమీపంలో కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 29 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జమేజా ముబిన్ మృతి చెందాడు. అయితే ఈ యువకుడికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కారు పేలుడులో మరణించిన వ్యక్తి దేవాలయం, ఇతర భవనాలపై ఉగ్రదాడులు చేసేందుకు కూడా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ముబిన్ రెండు సిలిండర్లు తెరిచి ఉన్న కారును నడుపుతుండగా, వాటిలో ఒకటి పేలిపోయిందని పోలీస్ అధికారులు(police officers) తెలిపారు. ఆ క్రమంలో అతని ఇంట్లో వెతికిన తర్వాత పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. అవి భవిష్యత్తులో మరిన్ని పేలుళ్ల కోసం ఉద్దేశించినవని తమిళనాడు పోలీసులు పేర్కొన్నారు. కోయంబత్తూర్ కారు పేలుడు కేసులో NIA దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇప్పటికే తొమ్మిది మందికిపైగా అనుమానితులను అరెస్టు చేశారు.
మరోవైపు నవంబర్ 19న కర్ణాటక మంగళూరు(mangalore)లో జరిగిన ఆటో రిక్షా పేలుడు(auto blast)లో ప్రధాన నిందితుడు సహా ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటనపై కూడా ఎన్ఐఏ వివరాలను ఆరా తీస్తోంది. ఇప్పటికే ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్’ అని పిలుచుకునే ఓ ఉగ్ర సంస్థ ఆటో-రిక్షా పేలుడుకు తామే చేశామని ప్రకటించింది. అంతేకాదు మంగుళూరు కద్రిలోని హిందూత్వ దేవాలయంపై దాడిలో భాగంగానే ఇది జరిగినట్లు తెలిసింది. దక్షిణ భారతదేశంలో ISIS టెర్రర్ సంస్థను స్థాపించాలనే ఉద్దేశ్యంతోనే నవంబర్లో పలువురు దుండగులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలోని అటవీ ప్రాంతాలను సందర్శించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.