Breaking పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్.. పలు రైళ్లకు అంతరాయం
ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఈ సంఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజిపేట- సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. భువనగిరి, బీబీనగర్, ఘటకేసర్ స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రైళ్లను రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ఏపీలోని విశాఖపట్టణం (Visakhapatnam) నుంచి తెలంగాణ (Telangana)కు వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు (Godavari Eexpress) పట్టాలు (Derailed) తప్పింది. బోగీలు (Bhogis) పట్టాల బయటకు చేరడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే అప్రమత్తమైన పైలెట్ వెంటనే రైలును నిలిపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. పొద్దుపొద్దునే ఈ ఘటన సంభవించడంతో ప్రయాణికులు (Passengers) భయాందోళన చెందారు. అయితే ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు వారికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
విశాఖపట్టణం నుంచి మంగళవారం గోదావరి ఎక్స్ ప్రెస్ (12727) బయల్దేరింది. బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకోవాల్సిన ఈ రైలు మేడ్చల్ జిల్లాలో పట్టాలు తప్పింది. ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అయితే వేగం నెమ్మదిగా ఉండడంతో వెంటనే మేల్కొన్న పైలెట్ రైలును నిలిపివేశాడు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళన చెందారు. ప్రమాదమేమి లేదని తెలిసి ప్రయాణికులు కుదుటపడ్డారు. ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఈ సంఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజిపేట- సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. భువనగిరి, బీబీనగర్, ఘటకేసర్ స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రైళ్లను రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఉదయం 6.30 గంటలకు రైలు చేరుకోవాల్సి ఉంది. ఆలస్యంగా నడుస్తున్న ఈ రైలు బీబీనగర్ స్టేషన్ దాటగానే ప్రమాదానికి గురైంది. ఆయిల్ లీకేజీ, ఆటోమేటిక్ బ్రేకులు పడకపోవడంతోనే రైలు పట్టాలు తప్పిందని సమాచారం. ఇంజన్ వెనకాల ఉన్న 10 బోగీలు సురక్షితంగా ఉండడంతో వాటితో రైలు హైదరాబాద్ వెళ్లింది. ఇక నాలుగు బోగీల్లో ఉన్న మిగతా ప్రయాణికులను ప్రత్యేకంగా వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. అయితే ప్రమాదంతో తమ ప్రయాణం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము వేసుకున్న ప్రణాళికలు దెబ్బతిన్నాయని వాపోయారు. ప్రమాదంతో దాదాపు కిలోమీటర్ మేర పట్టాలు ధ్వంసమయ్యాయని రైల్వే సిబ్బంది తెలిపారు.