»Nagarjuna Will Take Revenge Against Balakrishna At Ntr 100 Years Celebrations
Balakrishna:తో ఆ విషయంలో పోటీపడనున్న నాగ్..?
బాలకృష్ణ(balakrishna), నాగార్జున(Nagarjuna).. ఇద్దరూ సమకాలీన నటులు. వీరిద్దరూ చెప్పుకోదగిన పెద్ద స్నేహితులు కాకపోయినా, శత్రవులు మాత్రం కాదు. కానీ వీరి తండ్రులు మాత్రం మంచి స్నేహితులు. వీరిద్దరూ కళామతల్లి ముద్దుబిడ్డలు. వీరిద్దరిని అప్పటి ప్రజలు విపరీతంగా అభిమానించేవారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా విపరీతంగా హిట్ అయ్యాయి. సొంత అన్నదమ్ముల్లా ప్రవర్తించేవారు. బాలకృష్ణ సోదరుడు హరికృష్ణతో కూడా నాగ్ మంచి అనుబంధం ఉంది. సొంత సోదరుడిలా భావిస్తారు. కానీ, ఇటీవల బాలకృష్ణ చేసిన కొన్ని కామెంట్స్.. వారి కుటుంబాల మధ్య దుమారం రేపాయి.
కొంతకాలం క్రితం ఓ ఈవెంట్ లో బాలకృష్ణ(balakrishna)అక్కినేని, తొక్కినేని అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తండ్రితో సమానమైన వ్యక్తిని బాలకృష్ట అలా మాట్లాడటం వారి కుటుంబాల మధ్య వైరానికి దారితీసింది. దానిపై బాలకృష్ణ క్షమాపణలు కూడా చెప్పలేదు. దీంతో, అప్పటి నుంచి ఎన్టీఆర్ vs ఏఎన్నార్ గా మారింది. ఆ మధ్య ఈ వివాదం కాస్త సద్దుమణిగినా మళ్లీ ఈ వివాదం తెరపైకి రావడం గమనార్హం.
ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ శతయజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు.
అయితే, వచ్చే ఏడాది ఏఎన్ఆర్(ANR) శత జయంతి ఉత్సవాలు కూడా జరగనున్నాయి. దీంతో వాటిని కూడా నాగార్జున(Nagarjuna) గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వీటికి పోటీగా, నాగార్జున ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలను దీనికి మించి చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
అదే జరిగితే, సద్దుమణిగింది అనుకున్న వివాదం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రెండు కుటుంబాల వివాదం ఎక్కడి దాకా దారి తీస్తుందో చూడాలి.