MP Komatireddy Venkat Reddy's residence meeting of Congress leaders
తెలంగాణ (Telangna) రాష్ట్రంలో రాజకీయంగా కాంగ్రెస్ వేగం పెంచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్(Congres) పార్టీలో చేరికలపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(komati reddy venkat reddy) తెలిపారు. హైదరాబాద్లోని కోమటిరెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే(ManikRao Takre), పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy)తో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని కోమటిరెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ఫలితం సాధించిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేదానిపై, ప్రజల్లోకి తమ పాలసీలను తీసుకెళ్లే విధానంపై చర్చించినట్లు తెలుస్తుంది.