Gold rate today: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..మళ్లీ పెరిగిన ధరలు
బంగారం(gold) కొనాలని చూసే వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే పుత్తడి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా 60 వేల రూపాయలను దాటేసింది. మరోవైపు వెండీ రేట్లు కూడా పెరిగాయి.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో బంగారం ధరలు(gold rates) మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్(hyderabad)లో జూలై 19న ఉన్న బంగారం రేటు(gold rates) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,100గా ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,100గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.81,400కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగూణంగా ప్రతి క్షణం ఈ ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఆయా సమయాల్లో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేసుకుని కోనాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.55,100, 24 క్యారెట్ ధర రూ.60,100
ఢిల్లీ(delhi)లో 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.55,130, 24 క్యారెట్ ధర రూ.60,130
చెన్నైలో 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.47,927, 24 క్యారెట్ ధర రూ.52,285
బెంగళూరులో 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.55,100, 24 క్యారెట్ ధర రూ.60,100
ముంబైలో 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.55,100, 24 క్యారెట్ ధర రూ.60,100