»Mp Asaduddin Owaisi Asaduddin Comments On Telangana Secretariat
MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్రటేరియట్ పై అసదుద్దీన్ కామెంట్స్..!
MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశంలో కూడా సుపరిపాలన అందిస్తారని అన్నారు. తెలంగాణలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నారు. కేసీఆర్ వంటి వ్యక్తులు దేశానికి అవసరమని ప్రశంసించారు.
తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశంలో కూడా సుపరిపాలన అందిస్తారని అన్నారు. తెలంగాణలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నారు. కేసీఆర్ వంటి వ్యక్తులు దేశానికి అవసరమని ప్రశంసించారు.
ఇక, తెలంగాణ సెక్రటేరియట్‌పై కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ చాలా అందంగా ఉందని, తాజ్ మహల్ కంటే అందంగా, అద్భుతంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై కూడా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమను బీజేపీ బీ టీమ్ అని చెబుతున్నారని, తమకు బీజేపీ ఎప్పుడూ పొసగదని, బీజేపీని దేశంలో గద్దె దించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. దేశంలో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేయాల్సిన అంశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల వరకు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.
కాగా… తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం తుది దశకు చేరుకున్నది. ఈనెల 17వ తేదీన ఈ సెక్రటేరియట్‌ను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.