»Missed Calls Of 1 16 Crore Families Support To Ysrcp Jagan In Ap
Support: 1.16 కోట్ల కుటుంబాల మిస్ కాల్స్..ఏందయ్యా ఇది
'జగనన్నె మా భవిష్యత్తు' పీపుల్ సర్వే విజయవంతంగా ముగిసినట్లు వైఎస్సార్సీపీ(YSRCP) పార్టీ వెల్లడించింది. ఏపీ తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో మెగా ప్రజల సర్వే ఫలితాలను ఈ మేరకు ప్రకటించింది. అయితే ఈ సర్వేలో 80 శాతానికి పైగా ప్రజలు పాల్గొనడంతోపాటు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీ(ap)లో ‘జగనన్నె మా భవిష్యత్తు’ ప్రజల సర్వే సూపర్ హిట్ అయిందని అధికార వైఎస్సార్ సీపీ(YSRCP) పార్టీ అంటోంది. నిన్న ఈ సర్వే విజయవంతంగా ముగియడంతో ఫలితాలను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలు వెల్లడించారు.
ఈ క్రమంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. జగనన్నె మా భవిష్యతు మెగా పీపుల్స్ సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలు పాల్గొన్నట్లు తెలిపారు. 80 శాతానికి పైగా కుటుంబాలు(families) ముఖ్యమంత్రికి తమ మద్దతును ప్రకటించాయని చెప్పారు. ఈ సర్వే ఏపీ వ్యాప్తంగా తొలిసారిగా ఏప్రిల్ 7న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పార్టీ సైన్యం మొత్తం 1.16 కోట్ల కుటుంబాల తలుపులను తట్టిందని నేతలు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ సర్వే ఫలితాల పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) సంతోషం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ విధానాలు, పాలనపై విశ్వాసం ఉంచిన 1.16 కోట్ల కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేశారు. మీకు మరింత సేవ చేసేందుకు భగవంతుని దయ, మీ ఆశీస్సులు కోరుకుంటున్నానని అన్నారు.
దేశ రాజకీయాలలో ఇలాంటి రాజకీయ సర్వే మునుపెన్నడూ చూడలేదని వైసీపీ నేత(ycp leader) అయోధ్యరామి రెడ్డి అన్నారు. ఫలితం ఆసక్తికరంగా ఉందన్నారు. ఇది ఇతర రాజకీయ పార్టీలకు ట్రెండ్ సెట్ చేయబోతోందని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో 1.45 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొనడం చాలా మంచి పరిణామమని అన్నారు.
ఈ క్రమంలో జగన్(jagan)కు మద్దతుగా 1.16 కోట్లకు పైగా కుటుంబాలు మిస్డ్ కాల్స్(miss calls) ఇచ్చారని స్పష్టం చేశారు. ఇది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని వెల్లడించారు. దీంతో ఏపీలో మా నమ్మకం నువ్వే నినాదం థ్రిల్లింగ్గా ఉందన్నారు.
ఈ మైలు రాయిని రాత్రికి రాత్రే సాధించలేదని మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఏడు లక్షల మంది అట్టడుగు స్థాయి కార్యకర్తలకు ఆరు నెలల పాటు పార్టీ శిక్షణ ఇచ్చింది. ఇళ్లు, సచివాలయాలు, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాలతో పక్కాగా మ్యాప్ చేసింది. వ్యూహాత్మక కార్యాచరణ(plan) మాకు ఉపయోగపడిందని.. ప్రజల(people) నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని వెల్లడించారు.