Gujarat Earthquake: గుజరాత్లో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన జనం
గుజరాత్ లోని సూరల్ జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూపంకం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు తెలిపారు.
టర్కీ, సిరియాలో భారీ భూకంపం(Earthquake) వల్ల మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. శనివారం ఆ సంఖ్య 25 వేలు దాటింది. ఆ ఘటన మరువక ముందే భారత్ లో మరో భూకంపం సంభవించింది. గుజరాత్ లోని సూరల్ జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూపంకం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు తెలిపారు.
ఇండియాలో ఈ భూకంప కేంద్రం సూరత్ కు నైరుతి దిశగా 27 కిలో మీటర్లు దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 5.2 కిలోమీటర్ల లోతులో భూకంపం(Earthquake) సంభవించినట్లు వెల్లడించారు. భూ ప్రకంపనలతో సూరత్ తో సహా ఆ పరిసన ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు. భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.
గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (జీఎస్డీఎమ్ఏ) ప్రకారంగా రాష్ట్రంలో 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001 సంవత్సరాలలో భారీ భూకంపాలు(Earthquakes) సంభవించి చాలా మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. ఈ భూకంప ఘటనల్లో 2001వ ఏడాదిలో కచ్ ప్రాంతం వద్ద భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం(Earthquake) ధాటికి 13,800 మంది మృత్యువాత పడ్డారు. 1.67 లక్షల మంది ప్రజలు తీవ్రంగా గాయపడిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ భూకంపమే ప్రపంచంలోనే అతిభారీ భూకంపాల్లో మూడోదిగా నిలిచింది. ఇకపోతే భారత్లో అత్యంత విధ్వంసం సృష్టించిన భూకంపాల్లో రెండోదిగా నిలిచింది.
టర్కీ, సిరియాలో భూకంపాలు(Earthquakes) సంభవిస్తాయని నెదర్లాండ్స్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ ముందుగానే అంచనా వేశాడు. అయితే తాజాగా ఆయన భారత్ ఉపఖండంలో కూడా భూకంపాలు సంభవిస్తాయని చెప్పటం అందర్నీ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ లోని సూరత్ లో భూమి కంపించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సూరత్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు(Earthquake) సంభవించినట్లు అధికారులు గుర్తించారు. శనివారం సంభవించిన భూకంపం(Earthquake) రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో నమోదైంది. టర్కీ, సిరియా భూకంప విషాదలు కొనసాగుతుండగా గుజరాత్ తో భూమి కంపించటంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లో ఇది వరకూ భూకంపాలు చాలానే జరిగాయి. అయితే శనివారం కూడా భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం గుజరాత్ లో అక్కడి పరిస్థితి చక్కబడింది.
ఇకపోతే టర్కీ(Turkey), సిరియా(Syria)లో భూకంపం(Earthquake) వల్ల గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. టర్కీ, సిరియాలో శిథిలాలను తొలగిస్తుండటంతో ఏ రాయిని కదిపినా కూడా దాని కింద ప్రాణం లేని దేహాలే కనిపిస్తుండటంతో అందర్నీ కలచి వేస్తున్నాయి. అక్కడి దృశ్యాలు ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా అందరూ టర్కీ ప్రజల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు టర్కీకి తరలి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. వరుస భూకంపాల(Earthquake) నేపథ్యంలో టర్కీ(Turkey) ప్రాంతం మొత్తం శవాల గుట్టలుగా మారడంతో అక్కడి పరిస్థితి హృదయ విదారకంగా మారింది.