ఉత్తర ప్రదేశ్ షాజహాన్ పూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి, రాడ్డుతో కొట్టగా.. ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు.
ఉత్తర ప్రదేశ్ లో (uttar pradesh) దారుణం జరిగింది. ఒక వ్యక్తి దొంగతనం చేశాడనే అనుమానంతో (accused of theft) ఓ ట్రాన్సుపోర్ట్ మేనేజర్ (transport manager) అతనిని స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్డుతో దారుణంగా చితకబాదడంతో… ఆ దెబ్బలు తాళలేక అతను చనిపోయిన విషాధ సంఘటన చోటు చేసుకున్నది. షాజహాన్ పూర్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులో చూసింది. బంకిం అనే వ్యక్తి కొన్నేళ్లుగా ట్రాన్సుపోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు (transport business). ఇతని వద్ద 32 ఏళ్ల శివమ్ జోహ్రీ అనే వ్యక్తి ఏడేళ్లుగా మేనేజర్ గా పని చేస్తున్నాడు. వ్యాపారి కొన్ని వస్తువులను ఇతరులకు ట్రాన్సుపోర్ట్ చేశాడు. అలా ట్రాన్సుపోర్ట్ చేసిన వస్తువుల్లో కొన్ని అక్కడకు చేరలేదు. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని… ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత శివమ్ పైన అనుమానంతో స్తంభానికి కట్టేసి తన మనుషులతో ఇనుప రాడ్డుతో కొట్టించాడు. ఈ దెబ్బలు తాళలేక అతను చనిపోయాడు.
అతను చనిపోయిన విషయం గుర్తించి, మృతదేహాన్ని షాజహాన్ పురలోని ప్రభుత్వ ఆసుపత్రి బయట పడేసి వెళ్లిపోయారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య ఘటనగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ జరిపారు. ఇదే సమయంలో శివంను రాడ్డుతో చితకబాదుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీని ఆధారంగా బంకిం, నీరజ్ సహా మరో ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు, వారిపై కేసు నమోదు చేశారు.