అందరూ అనుకున్నట్లుగానే… కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మరో అడుగు ముందుకు వేశారు. టీఆర్ఎస్ ( తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని బీఆర్ఎస్( భారత్ రాష్ట్ర సమితి) గా మార్చారు. కాగా… పార్టీ ని జాతీయ పార్టీగా మారుస్తూ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి 283 మంది సభ్యులు ఆమోద ముద్ర వేయడం గమనార్హం.
దేశ రాజకీయాల్లో ఎందుకు వెళ్లాలి అనే విషయంపై ఈ సందర్భంగా పార్టీ సభ్యులకు కేసీఆర్ వివరించారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించగానే తెలంగాణ భవన్ బయట టీఆర్ఎస్ నేతలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
కాగా.. కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ మధ్యాహ్నం టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు సహా 283 మంది కీలక ప్రతినిధులు ఈ కీలక భేటికి హాజరయ్యారు. ఈ సమావేశానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్తో పాటు ఎంపీలు హాజరయ్యారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.