»Jr Ntr Back To Hyderabad After Oscars Award Function
Jr NTR: నా బెస్ట్ మూమెంట్ అదే… భార్యకు ఫోన్ చేసి చెప్పా
ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో (Oscar Award Function) స్టేజ్ పైన నిల్చొని సంగీత దర్శకుడు కీరవాణి (mm keeravani), పాటల రచయిత చంద్రబోస్ (chandrabose) అవార్డును తీసుకున్న క్షణాలను తాను ఎప్పటికీ మరిచిపోలేనని, తన బెస్ట్ మూమెంట్ అదేనని టాలీవుడ్ సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అన్నారు.
ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో (Oscar Award Function) స్టేజ్ పైన నిల్చొని సంగీత దర్శకుడు కీరవాణి (mm keeravani), పాటల రచయిత చంద్రబోస్ (chandrabose) అవార్డును తీసుకున్న క్షణాలను తాను ఎప్పటికీ మరిచిపోలేనని, తన బెస్ట్ మూమెంట్ అదేనని టాలీవుడ్ సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అన్నారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం అతను తిరిగి హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు (rajiv gandhi international airport) చేరుకున్న ఆయనకు అభిమానులు (Jr NTR Fans) ఘన స్వాగతం పలికారు. జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్యాన్స్ అభిమానానికి ఆయన ముగ్ధులయ్యారు. వారికి హాయ్ చెప్పారు. ఆ తర్వాత ఆయన ఆస్కార్ అవార్డు పైన మాట్లాడారు.
ఆస్కార్ వేడుకలలో పాల్గొనడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, స్టేజ్ పైన కీరవాణి, బోస్ లు నిల్చొని అవార్డు తీసుకున్నది తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని చెప్పారు. మన దేశం మాదిరిగానే ఆస్కార్ అవార్డు కూడా చాలా గొప్పగా ఉందని చెప్పారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమని, అదో అద్భుతమన్నారు. నేను భారతీయుడిని… అందులోను తెలుగు వాడిని అయినందుకు ఎంతో గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. తమకు ఇంతటి గౌరవం దక్కడానికి అభిమానులు, సినిమా ప్రియులు, తెలుగు వారు కారణమన్నారు. వారి ప్రేమ, ఆశీస్సుల వల్లే తమకు అవార్డు వచ్చిందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రోత్సహించిన ప్రతి భారతీయుడికి నేను థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. ఈ అవార్డు రాగానే తాను మొదట తన భార్యకు ఫోన్ చేసి, తన ఆనందాన్ని పంచుకున్నానని చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ నటించిన, ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన, ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు (Oscar for Naatu Naatu song from RRR) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డును కీరవాణి, చంద్రబోస్ లు స్టేజ్ పైన తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రాజమౌళి ఎగిరి గంతేసారు. ఇదిలా ఉండగా, ఆస్కార్ సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్కువసార్లు ప్రస్తావన వచ్చిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఎక్కువసార్లు ప్రస్తావించిన నటుల జాబితాలో జూ.ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ లు (Ram Charan) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.