గతకొన్ని రోజుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు(IT Raids) జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu States)ని మరికొన్ని ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు(Income Tax Officers) దాడులు చేపట్టారు. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) రాష్ట్రాల్లోని కళామందిర్ షాపులు, డైరెక్టర్ల నివాసాల వద్ద ఐటీ శాఖ అధికారులు(Income Tax Officers) సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని 40 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు(IT Raids) చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 6 గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ ఇళ్లకు ఐటీ అధికారులు చేరుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ అధికారులు(Income Tax Officers) సోదాలు చేపడుతున్నారు. హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖపట్నంలోని పలు షాపుల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు(IT Raids) చేస్తున్నారు.