»Ipl 2023 Mumbai Who Defeated Lucknow Will Fight Against Gt May 26th
IPL2023: లక్నోను చిత్తుగా ఓడించిన ముంబై..రేపు GTతో పోరు
IPL 2023లో నిన్న జరిగిన లాస్ట్ ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(MI) జట్టు లక్నో(LSG)ను చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన క్వాలిఫైయర్ 2కు ముంబై జట్టు సిద్ధంగా ఉంది.
ఐపీఎల్ 2023 చివరి ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(MI) జట్టు అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్ 23 బంతుల్లో 41, సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 33, తిలక్ వర్మ 26, నేహాల్ వధేరా (12 బంతుల్లో 23) స్కోర్లు చేశారు.
ఈ నేపథ్యంలో183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆటగాళ్లు 101 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ముంబై బౌలర్ల దాటికి వరుసగా కుప్పకూలారు. ఈ మ్యాచులో ముంబై బౌలర్ 5 వికెట్లు తీసి ఆకాష్ మధ్వల్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. లక్నో జట్టు గత సీజన్లో కూడా ఇదే విధమైన ఫలితం తర్వాత ఎలిమినేటర్లో ఓడిపోవడం ఇది వరుసగా రెండో సంవత్సరం కావడం విశేషం.
ఈ క్రమంలో MI శుక్రవారం(మే 26న) నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2లో GTతో తలపడుతుంది. ఆ తర్వాత ఆదివారం జరిగే ఫైవల్ పోరుకు ముంబై వెళ్తుందా లేదా గుజరాత్ వెళ్తుందా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.