»Husband Died After Drinking Alcohol Wife Destroyed Bottles In Wine Shop At Nacharam Hyderabad
Alcohol: తాగి భర్త మృతి..వైన్ షాపులో సీసాలు ధ్వంసం చేసిన భార్య
ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తిని వైన్ షాపు సిబ్బంది పట్టించుకోకుండా రోడ్డు పక్కన పడేశారు. దీంతో అతను అస్వస్థతకు గురై మృత్యువాత చెందాడు. ఇది తెలిసిన అతని భార్య అక్కడకు వచ్చి కోపంతో వైన్ షాపులోని సీసాలను పగులగొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
AP Real Estate Company Tenders Telangana Wineshops
ఓ మహిళ మద్యం షాపు(wine shop)నకు వెళ్లి అందులోని సీసాలను ధ్వంసం చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చుద్దాం. హైదరాబాద్(hyderabad) నాచారం(nacharam) పరిధిలో ఉండే నాగి అనే వ్యక్తి నిన్న రాత్రి కనక దుర్గ వైన్ షాపుకి వెళ్లి సిట్టింగ్ రూములో కూర్చుని మద్యం సేవించాడు. ఆ నేపథ్యంలోనే మందు ఎక్కువ కావడంతో స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. అది గమనించిన వైన్ షాపు సిబ్బంది అతనికి రక్షణ కల్పించాల్సింది పోయి..అతన్ని బయటకు తీసుకెళ్లి రోడ్డు పక్కన వదిలేశారు. ఆ తర్వాత అతను మరణించాడు. అయితే భర్త ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆమె వైన్ షాపు వద్దకు వచ్చి చూసి భర్త(husband) మరణించాడని తెలుసుకుని ఆ షాపువారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో షాపులోని సీసాలను పగులగొట్టింది. అంతేకాదు అతని కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆ వైన్ షాపు ఎదుట ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.