»Hindi Chatrapati Movie Release Date Final On May 12th 2023
Chatrapati: హిందీ చత్రపతి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎస్ఎస్ రాజమౌళి 'ఛత్రపతి(Chatrapati)' హిందీ రీమేక్ చిత్రం అధికారిక విడుదల తేదీ ఖరారైంది. మే 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ ను టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) చేస్తుండగా, హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భారుచ్చా యాక్ట్ చేస్తున్నారు.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో తొలిసారిగా యాక్ట్ చేస్తున్న చత్రపతి(Chatrapati)మూవీ విడుదల తేదీ ఖరారైంది. మే 12, 2023న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ హిరో చిత్రాన్ని పోస్ట్ చేసి ప్రకటించారు. పోస్టర్లో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. నీళ్లలో నిలబడి ఉన్న శ్రీనివాస్ బేర్బ్యాక్ను చూపిస్తూ ప్రదర్శించాడు. కానీ నటుడి ముఖం మాత్రం చూపించలేదు. మరోవైపు కుడి చేతిలో ఓ చెంబును పట్టుకుని ఆవేశంతో ఉన్న హీరో లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ లుక్ చూసిన బెల్లంకొండ ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భారుచ్చా ఎంపికైంది. ఈ నటి 2010లో తాజ్ మహల్ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. చత్రపతి ఆమె రెండవ తెలుగు చిత్రం.
చత్రపతి(Chatrapati) హిందీ రీమేక్‌కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. జయంతిలాల్ గడాస్ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఒరిజినల్‌కి కథ రాసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ రీమేక్‌కి స్క్రిప్ట్‌ను కూడా రాశారు. తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహమ్మద్ మోనాజీర్, ఆరోషికా డే, వేదిక, జాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
తెలుగులో అల్లుడు అదుర్స్, సీత వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషించడానికి పూర్తి మేక్ ఓవర్ అయినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో శ్రీనివాస్ ప్రభాస్ పాత్రను పోషిస్తున్నాడు. అంతేకాదు హిందీలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడంతోపాటు హిందీలో మాట్లాడేందుకు శిక్షణ కూడా తీసుకున్నాడు. భాష నేర్చుకోవడానికి హిందీ క్లాసులు సైతం తీసుకుని ఎక్కువగానే హర్డ్ వర్క్ చేశాడు. హిందీ రీమేక్ కథాంశం, టైటిల్ 2005లో విడుదలైన తెలుగు చలనచిత్రం ఛత్రపతి యొక్క అసలైన వెర్షన్ వలె ఉంటుంది.