»High Tension At Ed Office Central Forces Are Reached
ED office వద్దకు కేంద్ర బలగాలు.. హైటెన్షన్
Delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi liquor scam) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. కాసేపటి క్రితం ఈడీ ఆఫీసు వద్దకు కేంద్ర బలగాలు (central forces) చేరుకున్నాయి. దీంతో హై టెన్షన్ నెలకొంది. ఏం జరుగుతుందోననే ఆందోళన ఉంది.
High tension at ED office, central forces are reached
Delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi liquor scam) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. కాసేపటి క్రితం ఈడీ ఆఫీసు వద్దకు కేంద్ర బలగాలు (central forces) చేరుకున్నాయి. దీంతో హై టెన్షన్ నెలకొంది. ఏం జరుగుతుందోననే ఆందోళన ఉంది. ఈ నెల 11వ తేదీన కూడా కవితను (kavitha) ఈడీ విచారించింది. అయితే ఆ రోజు రాత్రి 8 గంటలకు ఇంటికి పంపించేసింది. ఈ సారి మాత్రం రాత్రి 9 అవుతున్నా.. విచారించే సమయం 10 గంటలు అవుతున్నా బయటకు పంపించడం లేదు. అమిత్ అరోరా, మనీష్ సిసోడియాతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
మరోవైపు ఈడీ కార్యాలయం (ed offica) వద్ద ఉన్న జాగృతి కార్యకర్తలు, కవిత (kavitha) అనుచరులు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్కడినుంచి పంపించివేశారు. మహిళా పోలీసులు కూడా రావవడంతో.. కవిత (kavitha) అరెస్ట్ తప్పదా అనే సంకేతాలు వచ్చాయి. ఈ రోజు సాయంత్రం ఈడీ కార్యాలయానికి ఏజీ వెళ్లడంతో హైటెన్షన్ నెలకొంది. కవిత (kavitha) లాయర్లు గండ్ర మోహన్, భరత్.. వైద్యులు.. అందులో ఒక మహిళ ఉండటంతో ఇక అరెస్ట్ తప్పదనే ప్రచారం జరిగింది. వైద్యులు తిరిగి వచ్చారు. ఈడీ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ నేతలు చేరుకోగా.. పోలీసుల బలగాలను కూడా భారీగా మొహరించారు. ఈడీ ఆఫీసు వద్ద వర్షం కురుస్తోంది. అయినప్పటికీ కవిత (kavitha) విచారణ కొనసాగుతూనే ఉంది.
ఢిల్లీలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, కవిత భర్త అనిల్, ఇతర నేతలు ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా ఆత్మీయ సందేశం ఇచ్చారు. కవిత (kavitha) అరెస్ట్ అవుతారని ఇండైరెక్టుగా అందులో ప్రస్తావించారు.