స్టార్ యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు, నందితా శ్వేత యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిడింబ ఈరోజు(జులై 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనీల్ కన్నెగంటి డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై శ్రీధర్ గంగపట్నం నిర్మించారు. అయితే ఈ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటీ అనేది ఇప్పుడు చుద్దాం.
మూవీ: హిడింబ నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, షిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేక సుదాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు, తదితరులు దర్శకుడు: అనిల్ కృష్ణ కన్నెగంటి నిర్మాత: గంగపట్నం శ్రీధర్ సంగీత దర్శకుడు: వికాస్ బాదిసా బ్యానర్: SVK సినిమాస్ విడుదల తేదీ: జూలై 20, 2023
యంగ్ హీరో అశ్విన్ బాబు, నందితా శ్వేత నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిడింబ నేడు(జులై 20న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సహా పలు సీన్స్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. మరోవైపు మూవీ ప్రమోషన్స్ కూడా సరికొత్తగా చేసి సినిమాపై మరింత క్రేజ్ తెచ్చారు. అయితే అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం హిట్టా ఫట్టా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
కథ
హైదరాబాద్‌లో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. ఆ క్రమంలో 16 మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ అభయ్ (అశ్విన్ బాబు)కి సహాయం చేయడానికి కేరళ నుంచి ఆద్య (నందితా శ్వేత) అనే ప్రత్యేక అధికారిని పిలుస్తారు. ఈ వరుస కిడ్నాప్‌ల వెనుక మాఫియాను నడిపే స్థానిక గ్యాంగ్‌స్టర్ హస్తం ఉందని అభయ్ నమ్ముతాడు. కానీ ఆద్య కిడ్నాప్‌లకు గల ఒక కారణాన్ని గుర్తిస్తుంది. ఎరుపు రంగు దుస్తులు ధరించిన మహిళలు మాత్రమే తప్పిపోతుంటారు. ఆ నేపథ్యంలో కేరళలో కొన్నేళ్ళ క్రితం మహిళల అదృశ్యానికి, ఈ కేసుకు సంబంధం ఏమిటి? అంతరించిపోయిన హిడింబ జాతిలో చివరి వ్యక్తి ఎవరు? అండమాన్ దీవుల్లో ఉన్న ఓ తెగకు ఈ కేసుకు సంబంధం ఏంటీ? చివరకు ఏం తెలిసింది? ఈ కిడ్నాపులు ఎవరు చేస్తున్నారు? అభయ్, ఆద్య ఈ కేసును ఎలా చేధించారు అనేది తెలియాలంటే పూర్తి చిత్రం చూడాల్సిందే.
ఎవరెలా చేశారు?
అశ్విన్ బాబు ఈ సినిమాలో నేపథ్యానికి తగినట్లుగా కనిపిస్తాడు. కండలు తిరిగిన వ్యక్తిగా యాక్షన్ సీన్లలో ఆకట్టుకున్నాడు. కాలాబండా ఫైట్, కేరళలో తీసిన ఫైట్ బాగున్నాయి. యాక్షన్ సీన్లకు ఆయన న్యాయం చేశారు. ఐపీఎస్ క్యారెక్టర్లో నందితా శ్వేతా డ్రైస్సింగ్ స్టైల్, యాక్టింగ్ బాగున్నాయి. ఇక రఘు కుంచె, సంజయ్ స్వరూప్ పోలీసులుగా కనిపిస్తుండగా, శుభలేక సుదాకర్ సీఎం పాత్రలో వారి క్యారెక్టర్ల పరిధి మేరకు నటించి మెప్పించారు. దీంతోపాటు మకరంద్ దేశ్ పాండే, శ్రీనివాస రెడ్డి క్యారెక్టర్లు సహా తదితరుల క్యారెక్టర్లు పర్వాలేదు.
సాంకేతిక విభాగాల తీరు
యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన విధానం బాగుంది. వికాస్ బాడిసా బీజీఎం కూడా పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ పనితనానికి పెద్దగా చూపించలేదనిపిస్తుంది. ఈ చిత్రానికి మలుపులు, చీకటి థీమ్‌లతో కూడిన థ్రిల్లర్ అద్భుతమైన ఫోటోగ్రఫీ, స్కోర్‌ని కలిగి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో రెండూ పెద్దగా కనిపించవు. మరోవైపు సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్‌ని డీల్ చేసే విషయం కూడా ఎంఆర్ వర్మ ఎడిటింగ్ డిజాస్టర్ గా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+స్టోరీ
+సెకండాఫ్‌లో ట్విస్ట్
+పలు యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
-ఫస్ట్ హాఫ్‌లో లాజిక్ లేని సీన్స్
-స్క్రీన్ ప్లే
-లవ్ సాంగ్స్
-టెక్నికల్ అంశాలు