చాలా గ్యాప్ తరువాత హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో అశ్విన్ బాబు హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ఎలా సెలక్ట్ చేసుకున్నారో, ఆ క్యారెక్టర్ కోసం ఎంతలా కష్టపడ్డారో అనే ఆసక్తికరమైన విషయాలను వివరించారు.
HIDIMBHA: ఆటా అనే డ్యాన్స్ షో(Dance Show) ద్వారా తన ట్యాలెంట్ ను చూపించి బుల్లితెర ఫేమస్ యాంకర్ ఓంకార్(Omkar) తమ్ముడిగా రాజు గారి గది(Raju Gari gadi) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో అశ్విన్ బాబు(Ashwin Babu) నటించిన హిడింబ సినిమా త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా హిట్ టీవీ(Hit tv telugu)తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను చెబుతూ..అసలు ఈ చిత్రానికి హిడింబ(hidimba) అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పారు. ఆడియెన్ కి కొత్తదనం అందించాలనే ఆలోచనలోంచి పుట్టినదే ఈ కథ అని ఇక ఈ మూవీలో ప్రతీ సీన్ చాలా ఫ్రెష్ గా ఉంటుందని, ప్రేక్షకులు సీటు అంచున కూర్చొని చూస్తారని తెలిపారు. చాలా మంది ఇది సైకో థ్రిల్లర్ అని అనుకుంటున్నారు, కానీ ఇది కొత్త జోనర్ అని వెల్లడించారు.
ఇక హిడింబలో రెడ్ కలర్ ను ఎందుకు వాడారో తెలిపారు. ఈ ఫిల్మ్ కోసం అశ్విన్ ఎంత కష్టపడ్డాడో, ఆ క్యారెక్టర్ కోసం తాను తీసుకున్న ప్రత్యేక శ్రద్ధగా వివరించారు. ఇక దర్శకుడు అనిల్ కన్నెగంటి(Anil Kannagante) గురించి మాట్లాడుతూ.. ఆయనకు ఇప్పటి వరకు సరైన హిట్ రాలేదని కానీ దీనితో సూపర్ హిట్ అవుతారన్నారు. ఇందులో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో?, తన తదుపరి ప్రాజెక్ట్ లు ఏంటని? వాళ్ల అన్నయ్యతో ఉన్న అనుబంధం గురించి ఏం చెప్పారో, శివశంకర్ మాస్టర్ విషయంలో ఏం జరిగిందో? తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.