»Gutta Sukender Reddy Hot Comments On Congress And Bjp Party
Gutta sukender reddy: కాంగ్రెస్, బీజేపీకి ఇంకా బుద్ది రాలేదు
ఇటీవల కర్నాటకలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాతైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి రాలేదని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(gutta sukender reddy) వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారో ఇక్కడ చుద్దాం.
కర్నాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల తదనంతరం జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(gutta sukender reddy) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఇంకా బుద్ధి రాలేదని గుత్తా అన్నారు.
ఇదిలా ఉంటే కర్నాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైందని, మెజారిటీ స్థానాల్లో విజయం సాధించినా.. ఆ పార్టీ ఇంకా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకోలేకపోతోందని గుత్తా ఎద్దేవా చేశారు. ఈ ఎపిసోడ్‌తో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటల వ్యవహారం దేశమంతా మరోసారి వెల్లడైందని విమర్శించారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌లోనూ సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారన్నారు గుత్తా. ఐతే తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. వామపక్షాల మద్దతు లేకుండానే రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చామని ఈ సందర్భంగా గుర్తుచేశారు గుత్తా.
నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడిన క్రమంలో పేర్కొన్నారు. దేశంలో మతకల్లోలాలు సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ చూస్తోందని గుత్తా ఆరోపించారు. కర్ణాటకలో సీఎం సీటు కోసం ఇద్దరు పోటీ పడుతుండడగా.. తెలంగాణలో మాత్రం 12 మంది అభ్యర్థులు పోటీ పడే పరిస్థితి ఉందన్నారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణలో శరణ్యమని వ్యాఖ్యనించారు.