»Union Minister Kishan Reddy Watched Kerala Story Movie
Kishan Reddy : కేరళ స్టోరీ మూవీని వీక్షించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దేశ ప్రజలు కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాను వాస్తవానికి అనుగుణంగా తీసినట్టు భావిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. దేశంలో కొంతమంది మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని, అలాంటి ఘటనలను యావత్ సమాజం ఖండించాలని కిషన్రెడ్డి చెప్పారు
ది కేరళ స్టోరీ (The Kerala Story) వాస్తవాల ఆధారంగా తీసిన సినిమా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హైదరాబాద్ లోని నారాయణగూడ (Narayanaguda) శాంతి థియేటర్ లో బీజేపీ శ్రేణులతో కలిసి కిషన్ రెడ్డి సినిమాను చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో కొంతమంది మతం పేరుతో కుట్ర చేస్తున్నారని, అలాంటి ఘటనలను అందరూ ఖండించాలన్నారు. తీవ్రవాద సమస్య ఇండియా(India)లోనే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉందని ఆయన వెల్లడించారు. మూవీ గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి, సినిమాను చూడాలనుకున్నానని, కార్యకర్తల కోరిక మేరకు వారితో కలిసి చూశానని చెప్పారు. కేరళ రాష్ట్రంలో చాలా ఏళ్లుగా ఈ సినిమాలో చూపించిన ఘటనలు జరుగుతున్నాయన్నారు.
ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఏ రకంగా హింసిస్తున్నారో.. ఎలా మతమార్పిడి చేస్తున్నారో ఇందులో చూపించారన్నారు. సికింద్రాబాద్(Secunderabad)లోని స్వామి వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటుచేసిన రోజ్ గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలువురికి నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే రిక్రూట్ మెంట్లు ఆగిపోతున్నాయో తెలుసని ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియను చేపడుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.