తెలంగాణ గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల బీజేపీ నేతలు తమ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారంటూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా… తాజాగా గవర్నర్ తమిళి సై సైతం అలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం.
ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆమె కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు పై ఆల్రెడీ ఒక ప్రాసెస్ కొనసాగుతుందని, ఎందుకు బోర్డ్ తీసుకు రావాల్సి వచ్చిందో అందరికీ తెలియాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే అన్ని వర్సిటీలతో మాట్లాడానన్న ఆమె వీసీల రిపోర్ట్ తీసుకొని 2020లోనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చానని, ప్రధానంగా ఖాళీలను భర్తీ చేయాలని కోరానని అన్నారు. తెలంగాణకు న్యాయం జరగాలని నేను క్లారిఫికేషన్ అడిగానని పేర్కొన్న ఆమె మంత్రికి అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు.
రాజ్ భవన్ ను డీగ్రేడ్ చేసే విధంగా మంత్రి మాట్లాడారని అన్నారు. ప్రోటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అని ఆమె విరామర్సించారు. ప్రగతి భవన్ లాగా రాజ్ భవన్ గేట్లు మూసి వేయలేదన్న ఆమె నా డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. అంతేకాక తన ఫోన్ టాపింగ్ అవుతున్నట్టు అనుమానాలు ఉన్నాయని అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
విద్యను అమ్మకానికి పెడతారా? అంటూ ప్రశ్నించిన ఆమె ప్రభుత్వ యూనివర్సిటీ ల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. వాటి కండిషన్స్ ఈ ప్రభుత్వం పట్టించుకోదని, కానీ ప్రైవేట్ వర్శిటీలు పెంచుకుంటూ పోతారా? అని ప్రశ్నించారు. ఒక నెల డిలే అయిందని రాజ్ భవన్ ముట్టడి చేస్తామని అంటున్న సంఘాలు… ఈ 8 ఏళ్లు ఆలస్యం అయినందుకు ప్రగతి భవన్ ముందు ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు.