»Good News For Telangana Farmers Cash Deposit For 70 Lakh People
Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..70 లక్షల మందికి నగదు జమ
తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ విడత రైతుబంధు నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా 70 లక్షల మంది ఖాతాల్లో నగదు జమకానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ(Telangana) రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సోమవారం నుంచి రైతుబంధు(Rythu Bandhu) నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) వెల్లడించారు. నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్ (Cm Kcr)కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 70 లక్షల మంది ఖాతాల్లో రూ.7,720 కోట్లను జమచేయనున్నామన్నారు. కొత్తగా 1.50 లక్షల పోడు రైతులకు కూడా రైతుబంధు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత సీజన్‌తో పోలిస్తే ఈసారి కొత్తగా 5లక్షల మంది లబ్దిదారులు పెరిగినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) తెలిపారు. కొత్తగా చేరిన లబ్దిదారులతో మరో 300 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడిందని, ఈసారి 1.5 లక్షల మంది పోడు రైతులకు సుమారుగా 4 లక్షల ఎకరాలకు సైతం రైతు బంధు(Rythu Bandhu)ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతునూ ఆదుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్(KCR) సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
ప్రతి ఏటా రైతుకు సాయంగా రూ.10 వేల చొప్పున ఇస్తున్నామని, ఇప్పటికే 10 విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. తాజాగా 11వ విడతలో సోమవారం నుంచి లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లకు రైతు బంధు(Rythu Bandhu) సాయాన్ని అందిస్తున్నామన్నారు. 11వ విడతతో రైతుబంధు సాయం మొత్తంగా రూ.72,910 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఈ నిధుల వల్ల కోటీ 54 లక్షల ఎకరాలకు సాయం అందనున్నట్లు వెల్లడించారు.