»Go First Flight Services Are Closed Till May 9 Tickets Till 15th To
Go first: మే 9 వరకు గో ఫస్ట్ ఫ్లైట్ సర్వీసులు బంద్..15 వరకు టిక్కెట్స్ కూడా
భారతీయ విమానయాన సంస్థ గో ఫస్ట్(Go first) తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా మే 9, 2023 వరకు అన్ని విమానాలను రద్దు(closed) చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విమానయాన సంస్థ మంగళవారం దివాలా దాఖలు ప్రకటన చేసిన తర్వాత తెలిపింది. మరోవైపు అప్పటికే టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు తిరిగి డబ్బులు పంపనున్నట్లు వెల్లడించారు.
నగదు కొరతతో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్ కంపెనీ గో ఫస్ట్(Go first) మే 9 వరకు తన అన్ని విమానాలను రద్దు చేసింది. మొదట మూడు రోజులు విమాన కార్యకలాపాలు ఉండవని ప్రకటించిన సంస్థ..తాజాగా మరో నాలుగు రోజులు పొడిగించింది. వాడియా గ్రూప్ ఎయిర్‌లైన్ గో ఫస్ట్ ఈ మేరకు మే 15 వరకు కొత్త బుకింగ్‌లను తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఇప్పటికే టిక్కెట్స్ బుక్ చేసుకున్న బాధిత ప్రయాణికులకు క్యాష్ వాపసు చేస్తామని హామీ ఇచ్చింది.
ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్దేశించిన సమయం ప్రకారం ప్రయాణీకులకు రీఫండ్లను ప్రాసెస్ చేయాలని విమానయాన సంస్థను కోరింది.
ఇంజన్ తయారీదారు ప్రాట్ & విట్నీ (P&W) తన ఆర్థిక పరిస్థితికి కారణమంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో స్వచ్ఛంద దివాలా చర్యలకు పూనుకుంటున్నట్లు ఎయిర్‌లైన్ మంగళవారం ప్రకటించింది. ప్రాట్ & విట్నీస్ ఇంటర్నేషనల్ ఇంజన్లు సరఫరా చేసే విఫలమైన ఇంజన్ల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కారణంగా 25 విమానాలు లేదా ఎయిర్‌బస్ A320neo విమానాల సగభాగం తగ్గిపోయాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంస్థపై ఆర్థిక ఒత్తిడి కూడా పెరిగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Due to operational reasons, Go First flights until 9th May 2023 are cancelled. We apologise for the inconvenience caused and request customers to visit https://t.co/qRNQ4oQjYT for more info. For any queries or concerns, please feel free to contact us. pic.twitter.com/mr3ak4lJjX