Gangster Anil Dujana killed in encounter with UP Police
Gangster Anil Dujana:ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది. గ్యాంగ్స్టర్లను వరసగా ఎన్కౌంటర్లు చేస్తోంది. గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానాను ఈ రోజు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్క్ మీరట్ వద్ద ఎన్ కౌంటర్ చేసింది. అనిల్‌పై 62 కేసులు ఉన్నాయి. ఇందులో హత్య, దోపిడీ భూ కబ్జా అభియోగాలు ఉన్నాయి. వివిధ కేసుల్లో 2012 నుంచి జైలులో ఉండగా.. 2021లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. పాత కేసులకు సంబంధించి కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. అనిల్ దుజానాపై బులంద్ షహర్ పోలీసులు రూ.25 వేలు, నోయిడా పోలీసులు రూ.50 వేల రివార్డు ప్రకటించారు.
ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్, గులామ్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఝాన్సీ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అహ్మద్, గులామ్ ఇద్దరు చనిపోయారు. వీరిద్దరు ప్రయాగ్ రాజ్‌లో జరిగిన హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితులు అని పోలీసులు తెలిపారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అసద్‌పై 5 లక్షల రివార్డు కూడా ఉంది. ఉమేశ్ హత్య కేసులో అహ్మద్ తండ్రి గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ అరెస్టైన సంగతి తెలిసిందే.